యుగానికొక్కడు దర్శకుడితో రాణా
'యుగానికొక్కడు', 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ త్వరలో దగ్గుబాటి రాణా హీరోగా ఓ చిత్రాన్ని రూపొందించ బోతున్నారు. చాలా కాలం క్రితమే వీరి కాంబినేషన్ అనుకున్నప్పటికీ అనుకోనికారణాల వల్ల ఇప్పటి వరకు ఆచరణ సాధ్యం కాలేదు. మళ్లీ త్వరలో ఈ ప్రాజెక్టు ట్రాక్ మీదకు రాబోతోంది.
ప్రస్తుతం సెల్వరాఘవన్ 'ఇరండం ఉలగం' చిత్రం షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్రం తెలుగులో 'బృందావనంలో నందకుమారుడు'గా విడుదల కాబోతోంది. ఈచిత్రంలో ఆర్య, అనుష్క జంటగా నటిస్తున్నారు. హారిష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రం తర్వాత రాణా-సెల్వరాఘవన్ చిత్రం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం ఇవ్వనున్నారు. పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
ప్రస్తుతం రాణా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'డిపార్ట్‌మెంట్' చిత్రంలో నటిస్తున్నాడు. మరో వైపు క్రిష్ దర్శకత్వంలో 'కృష్ణం వందే జగద్గురుమ్'చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటి వరకు కెరీర్లో సరైన హిట్ లేని రాణా హిట్ కోసం తహతహలాడుతున్నాడు. మరి రాణాను టాప్ హీరోల లిస్టులోకి చేర్చే దర్శకుడు ఎవరో?


Click it and Unblock the Notifications











