రాణా రెడీ ...

తన పెద్ద మనుమడు..సురేష్ బాబు కుమారుడైన దగ్గుపాటి రాణా ని రామానాయుడు పుట్టిన రోజున (డిసెంబర్ 14) లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నారట. దానికోసం రాణా ముంబైలోని ఫిల్మ్ స్కూల్లో చేరి యాక్టింగ్ పాఠాలు వల్లె వేస్తున్నాడట. ఇక ఈ చిత్రానికి దర్శకుడిగా వెంకటేష్ కి 'ఆడు వారి మాటలుకు అర్ధాలే వేరులే' అనే మంచి హిట్ ఇచ్చిన సెల్వరాఘవన్ ని ఎంపిక చేసారట. అతను ఇప్పటికే కథ వినిపించి ట్రీట్ మెంట్ తో వస్తానని చెప్పాడట. దాంతో చిరవకు హీరోల లాంచింగ్ కూడా తమిళ దర్శకుల చేతుల్లోకి వెళ్ళిపోతోందని మనవాళ్ళు వేడి వేడిగా నిట్టూర్సున్నారు. సక్సెస్ కి తమళ,తెలుగు భేధాలేమిటి ...అది ఎక్కడుంటుందో అంతా అక్కడే ఉంటుంది అందరూ దాని చుట్టు ప్రక్కలే ఉంటారంటున్నారు ఇది విన్న సీనియర్లు.


Click it and Unblock the Notifications











