»   » మిలియనీర్ల జాబితాలో హీరో రానా, బాహుబలి ఎఫెక్టేనా?

మిలియనీర్ల జాబితాలో హీరో రానా, బాహుబలి ఎఫెక్టేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తెలుగు హీరో రానా ట్విట్టర్ మిలియనీర్ల జాబితాలో చేరిపోయాడు. ప్రముఖ సోషల్ మీడియా సైట్ ట్విట్టర్లో ఆయన్ను ఫాలో అయ్యే వారి సంఖ్య 1 మిలియన్ దాటింది. బాహుబలి సినిమాలో నటించడం వల్ల రానా స్టార్ ఇమేజ్ అమాంతం పెరిగి పోయింది. ఆ ఎఫెక్టుతోనే రానా ట్విట్టర్ మిలియనీర్ల జాబితాలో చేరాడని స్పష్టమవుతోంది.


బాహుబలి సినిమాలో రానా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. సినిమా మొత్తం అమరేంద్ర బాహుబలి, శివుడు.....భల్లాలదేవ పాత్రల చుట్టే తిరుగుతుంది. బాహుబలి, శివుడు పాత్రల్లో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తుండగా, ప్రతినాయకుడు భళ్లాలదేవ పాత్రను రానా పోషిస్తున్నాడు.


రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పార్ట్ 1 ‘బాహుబలి-ది బిగినింగ్' జులై 10న విడుదలకు సిద్ధమవుతోంది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నట్లే.... అందుకు తగిన విధంగానే సినిమా విడుదలకు ముందే ఈ సినిమా భారీగా బిజిజనెస్ చేస్తోంది.


Rana touched magical 1 million followers mark on Twitter

బాహుబలి పార్ట్ 1 ఒక్క తెలుగులోనే ఇప్పటి వరకు దాదాపు 83 కోట్ల బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు రిలీజ్ ముందే ఇంత పెద్ద మొత్తంలో బిజినెస్ జరుగలేదు. శాటి లైట్ రైట్స్, ఇతర రైట్స్ ఇలా అన్ని కలిపి పార్ట్ 1 ఇప్పటికే 125 కోట్ల బిజినెస్ చేసింది. ఇక తెలుగు, తమిళం, మళయాలం, విదేశీ వెర్షన్లు కలిపితే ఈ చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలోనే రికార్డు సృష్టించడం ఖాయం.


English summary
Rana Daggubati has touched the magical 1 million followers mark on Twitter. Expressing his happiness on his memorable feat, Rana tweeted, "Thank you for the love!! #1M".
Please Wait while comments are loading...