For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫోటోలు : త్రిష-రాణా ‘సం’బంధానికి సాక్ష్యాలు!

  By Bojja Kumar
  |

  హైదరాబాద్ : దగ్గుబాటి యువ హీరో రాణాపై చాలా కాలంగా ఓ రూమర్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సౌతిండియా పాపులర్ హీరోయిన్ త్రిషతో రాణా డేటింగ్ చేస్తున్నాడని, వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి పోయారని ఆ రూమర్స్ సారాంశం. అయితే చాలా సందర్భాల్లో ఈ వార్తలను ఇద్దరూ యాక్టర్లు ఖండించారు.

  తాము కేవలం మంచి స్నేహితులం మాత్రమే, మా మధ్య అంతకు మించి ఇంకేమీ లేదని స్పష్టం చేసారు. వారు ఎన్ని సార్లు తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని చెప్పినా వారిపై రూమర్స్ మాత్రం ఆగడం లేదు. అవార్డ్ ఫంక్షన్స్, క్రికెట్ మ్యాచులు, మూవీ ప్రీమియర్‌లు, ఈవెంట్స్, రెస్టారెంట్స్, పార్టీలు ఇలా ఎక్కడ చూసినా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండటమే ఈ రూమర్లకు కారణం.

  గతంలో చాలా మంది సినీ స్టార్లు వీరి మాదిరిగానే కలిసి తిరిగారు....మొదట్లో తాము కేవలం స్నేహితులం అంటూ బుకాయించారు. ఆ తర్వాత తమది ప్రేమే అని మాట మార్చి పెళ్లి చేసుకున్నారు. రాణా-త్రిష కూడా కూడా ఇదే బాపతు అనేది చాలా మంది వాదన. రాణా వయసు 28, త్రిష వయసు 30 అంటూ కొందరు వయసు తేడా చూపిస్తున్నా......చాలా మంది సెలబ్రిటీలు ఇలాంటి చిన్నపాటి వయసు తేడాతో పెళ్లి చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయని మరికొందరంటున్నారు.

  ఒక ఫోటో.....వెయ్యి రూమర్లకు కారణం కావచ్చు. కానీ వెయ్యి ఫోటోలు ఒక రూమర్‌ను నిజం అని తేల్చేస్తాయి. స్లైడ్ షోలో కనిపిస్తున్న ఫోటోలను బట్టి రాణా-త్రిష మధ్య ఉన్న బంధం ఎలాంటితో మీరే డిసైడ్ చేయండి.

  ప్రవేట్ మూమెంట్: రాణా-త్రిష చాలా సందర్భాల్లో కలిసి కనిపించారు. ఎక్కువ సేపు కలిసి గడిపారు. వీరి మధ్య స్నేహాన్ని మించిన ఇంకేదో బంధం ఉందనే చాలా మంది వాదన

  ఒకరి కోసం ఒకరు నిరీక్షణ: ఏదైనా కార్యక్రమానికి కలిసి హాజరైనప్పుడు ఒకరి కోసం ఒకరు వెయిట్ చేయడం వెనక ఆంతర్యం ఏమిటో..?

  ఎప్పుడూ కలిసే ఉంటున్నారు: ఇటీవల జరిగిన ఓ అవార్డు కార్యక్రమంలోనూ రాణా త్రిష వెన్నంటే ఉన్నాడు

  తరచూ కలుసుకోవడం: ఇద్దరూ కలిసి తరచూ రెస్టారెంట్లు, హోటళ్లలో కలిసి దర్శనం ఇస్తున్నారు.

  ఫన్నీ వేషాలు: ఇద్దరూ అనేక సందర్భాల్లో కలిసి ఫన్నీగా గడుపుతుంటారు

  క్రికెట్ మ్యాచ్: ఇటీవల ఐపీఎల్ మ్యాచ్‌లో ఇద్దరూ ఇలా కలిసి ఎంజాయ్ చేసారు

  రొమాంటిక్ కపుల్: ఒక్కోసారి వీరి ప్రవర్తన చూస్తుంటే వీరు చాలా రొమాంటిక్ అనే భావన కలుగుతుంది ఎవరిరైనా

  పార్టీలు..గట్రా: ఆ మధ్య ఒకసారి ఇద్దరూ తమ క్లోజ్ ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకుంటూ చిక్కారు

  అనేక సందర్భాల్లో కలిసి: ఓ కార్యక్రమానికి కలిసి హాజరైన త్రిష-రాణా...పక్కనే లక్ష్మి మంచు

  లవ్లీ కపుల్: ఈ పోటో చూస్తుంటు ఇద్దరూ లవ్లీ కపులా కనిపిస్తున్నారు కదూ...

  ఎంతో సౌకర్యవంతంగా: ఇతరులతో కలిసున్నప్పటికంటే ఈ ఇద్దరు కలిసి కనిపించినప్పుడు ఇద్దరూ ఎంతో సౌకర్యవంతంగా ఫీలవుతున్న విషయాన్ని గమనించవచ్చు.

  ఫోటో షూట్లలోనూ..: ఇప్పటి వరకు ఇద్దరు కలిసి నటించకపోయినా, ఇద్దరూ కలిసి సెక్సీగా పలు ఫోటో షూట్లలో పాల్గొన్నారు.

  సంతోషంగా: ఇద్దరూ కలిసారంటూ...వారి మొహాల్లో సంతోషం తొనికిసలాడుతోంది

  ఇద్దరూ ప్రేమలో పడ్డారా : ఇద్దరి ప్రవర్తన, ఆటిట్యూడ్ చూస్తుంటే ఇద్దరూ ప్రేమలో ఉన్నారా? అనే అనుమానం కలుగక మానదు

  మ్యూచువల్ ఫ్రెండ్స్: రాణా-త్రిష తాము ఇద్దరం మంచి స్నేహితులమని చెప్పుకుంటారు. ఇద్దరికీ సేమ్ ఫ్రెండ్స్, సేమ్ సర్కిల్ కలిగి ఉండటం ఆసక్తికరం

  లవ్లీ కపుల్ : ఇద్దరి స్నేహం వెనక ప్రేమ అనే మరో కోణం కూడా ఉందని అంటే మాత్రం ఈ ఇద్దరు అస్సలు ఒప్పుకోవడం లేదు. వీరిలో ఎవరో ఒకరి పెళ్లి అయితే కానీ ఈ రూమర్లు ఆగేలా లేవు. ఏమో ఇద్దరూ పెళ్లి చేసుకుంటారేమో? ఎవరికి తెలుసు?

  English summary
  Rana Daggubati, the young actor from the Daggubati clan, is an upcoming actor in Telugu and Hindi Industries. He started his career with the Telugu movie Leader. He is now rumoured to be dating popular actress Trisha, an established actress in Tamil and Telugu industries.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X