»   » బాలీవుడ్ నిర్మాతగా మారుతున్న హీరో రాణా!

బాలీవుడ్ నిర్మాతగా మారుతున్న హీరో రాణా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు హీరో దగ్గుబాటి రాణా బాలీవుడ్ నిర్మాత అవతారం ఎత్త బోతున్నారు. దమ్ మారో దమ్ చిత్రం ద్వారా బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాణా...ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ డిపార్టుమెంటులో నటించారు. అయితే నటుడిగా రాణాకు బాలీవుడ్లో కలిసి రాలేదనే చెప్పాలి. దీంతో తన దృష్టి నిర్మాణ రంగం వైపు పెట్టినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్లో చిత్ర నిర్మాణం గురించి రాణా మాట్లాడుతూ...'హిందీలో సినిమాలు నిర్మించాలనే ప్లాన్లో ఉన్నాను. ఒక మంచి వినోదాత్మక చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచన ఉంది. క్రికెట్ నేపథ్యంలో వచ్చిన తమిళ చిత్రం 'చెన్నై 600028' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నాం. అన్ని ఓకే అయితే వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది' అన్నారు.

రాణా సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం రాణా రెండు భారీ బడ్జెట్ చిత్రాల్లో ప్రధానమైన పాత్రల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బాహుబలి'. ఈ చిత్రంలో రాణా హీరో ప్రభాస్‌కు సోదరుడిగా కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం 2015లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

దీంతో పాటు గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క టైటిల్ రోల్‌ చేస్తున్న 'రుద్రమదేవి' చిత్రంలో నటిస్తున్నాడు. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో రాణా...రుద్రమదేవి భర్త పాత్ర అయిన చాలుక్య వీరభద్రుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో రాణా చేస్తున్న పాత్రలు అతని కెరీర్‌కు ఒక టర్నింగ్ పాయింటుగా నిలవనున్నట్లు స్పష్టమవుతోంది.

English summary
Rana to turn producer. He is all set to produce two Hindi films soon. “I have plans to produce movies in Hindi. But I am definitely looking at producing good entertaining Hindi films.I can tell you about one of them. It is a remake of a Tamil film on cricket called 'Chennai 600028'" said Rana.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu