twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో మోహన్ బాబు అయిపోతానేమోనన్న భయంతో రాణా...!

    By Sindhu
    |

    దగ్గుబాటి రాణాకి హిందీలో చాలా ఆఫర్లొస్తున్నాయని అంటున్నారే కానీ 'దమ్ మార్ దమ్" తప్ప అతనింత దాకా మరే హిందీ సినిమాకీ సైన్ చేయలేదు. 'డిఎండి" రిజల్ట్ బట్టి తనకేదైనా ఇమేజ్ వస్తుందేమో చూసుకుని, దాని అనుగుణంగా రేటు ఫిక్స్ చేసుకోవాలని రాణా వెయిట్ చేస్తున్నాడు. ఇదిలావుంటే రాణాకి బాలీవుడ్ లో మరో గ్రేట్ ఆఫర్ వచ్చిందని ఊహాగానాలు సాగుతున్నాయి. హృతిక్ రోషన్ తో తీసే 'క్రిష్2" సీక్వెల్ లో రాణా నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో నెగటివ్ ఛాయలున్న హృతిక్ తన స్నేహితుడు షారుక్ ని సంప్రదించగా, అతను సున్నితంగా తిరస్కరించాడట. దానికింకా టైముందని చెప్పాడట.

    ఇక మిగతా నటులు చాలా మందిని పరిశీలించాక, రాణా అయితే హృతిక్ హైటు, ఫిజిక్ కి తగ్గ విలన్ కాగలడని నమ్మకం కలిగి అతడినీ అడిగారట. ప్రస్తుతం మంతనాలు జరుగుతున్నాయని, ఇది కనుక ఓకే అయితే రాణా పంట బాలీవుడ్ లో పండినట్టేనని అనుకుంటున్నారంతా. అయితే రాణా మాత్రం తనలో విలన్ ని చూస్తున్నారేంటని రాణా ఆలోచనలో పడ్డాడు. నెగెటివ్ క్యారెక్టర్స్ వేస్తే మున్ముందు తనని అంతా అలాంటి పాత్రలకే పరిమితం చేసి హీరోగా సక్సెస్ అయినా కూడా మరో మోహన్ బాబులానే చూస్తారని అతని భయం.

    English summary
    Now here is the buzz that Rana to be seen in the sequel of Rakesh Roshan producing Krrish 2.Rana is in cloud nine as he spotted for another hindi movie before his debutant hindi movie yet to be released. As per the sources Rana was offered a negative role in Krrish 2 film.The talks are going on between Rakesh Roshan and Rana, lets wait that Jr.Daggupati to accept this big budget sci-fi thriller movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X