»   » పవన్ కళ్యాణ్ కోసం అడ్వాన్స్‌గా హీరో రానా ఇలా...

పవన్ కళ్యాణ్ కోసం అడ్వాన్స్‌గా హీరో రానా ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2న పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరో రానా ఒక రోజు ముందుగానే అడ్వాన్స్ గా తన ట్విట్టర్ పేజీ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేసారు.

ఆయన పేరు చెపితే బాక్సాఫీస్ బాక్స్‌లు బద్దలు అవుతాయి. కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి. వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఆయన సినిమా చూడాలన్న ఆసక్తి కలిగి భీభత్సమైన ఓపినింగ్స్ వస్తాయి. ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

Rana tweet about Pawan Kalyan

ఈ రోజు పవన్ పుట్టిన రోజు. 1971 సెప్టెంబర్ 2న జన్మించిన పవన్ కళ్యాణ్ 1996లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యిన పవన్ కళ్యాణ్ హిట్, ప్లాప్ లతో సంభంధం లేని స్టార్ హీరోగా ఎదిగారు. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన 'తొలిప్రేమ', 'తమ్ముడు', 'సుస్వాగతం', 'బద్రి' మరియు 'ఖుషి', ‘గబ్బర్ సింగ్', ‘అత్తారింటికి దారేది' చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ సాదించి సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగారు. పవన్ కళ్యాణ్ కి అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మరియు ఫ్యాన్స్ కు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక గ్రాండ్ గా చేసేందుకు అభిమానులు ఏర్పాట్లు భారీగా చేసారు.

English summary
"And as the world goes!! Happy Birthday Power Star Pawan Kalyan PawanKalyan! Bad picture but this is all I have." Rana tweeted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu