పూరికి బాబాయ్ కాదంటే అబ్బాయి దొరకాడట..?
దర్శకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ వున్న దర్శకుడు పూరీ జన్నాథ్ 'గోలీమార్" తర్వాత ఏ సినిమా చేస్తున్నాడో నిన్నటివరకు డైలమాలో వుంది. కొన్ని రోజులు బాలకృష్ణతో సినిమా చేస్తున్నాడని, మరి కొన్ని రోజులు వెంకటేష్ తో సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. బాలయ్యకి పూరీ చెప్పిన కథ నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇక వెంకటేష్ వేరే ప్రాజెక్ట్‌లతో బిజీగా వుండటం వల్ల మిస్ అయ్యాడు. ఇక ఇప్పుడు పూరీకి 'లీడర్" ఫేం రాణా దొరికాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నల్లమలపు శ్రీనివాస్ ఈ సినిమాని నిర్మించనున్నాడు. త్వరలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళనుంది.
రాణా పూరి జగన్నాథ్ బాలకృష్ణ వెంకటేష్ గోలీమార్ గోపిచంద్ ప్రియమణి నల్లమలపు శ్రీనివాస్ rana puri jagannath balakrishna venkatesh golimar gopichand priyamani nallamalapu srinivas


Click it and Unblock the Notifications