ఆ సినిమా నుంచి తప్పుకున్న దగ్గుబాటి రాణా
దగ్గుబాటి యువ హీరో రాణా 'వాడ చెన్నయ్' అనే తమిళ చిత్రంలో నటించేందుకు ఇటీవల అంగీకరించిన విషయం తెలిసిందే. ఆ సినిమా నుంచి రాణా అర్థాంతరంగా తప్పుకున్నాడనేది తాజా సమచారం. రాణా తప్పుకున్న విషయాన్ని ఆ చిత్ర నిర్మాత స్వయంగా వెల్లడించారు.
రాణా తప్పుకోవడంపై నిర్మాత దయానిది అళగిరి మాట్లాడుతూ...ఈ చిత్రంలో ఆయన పోషించవలసిన క్యారెక్టర్ రాణాకు పూర్తి స్థాయి సంతృప్తి ఇవ్వడం లేదని, దానికి తోడు జూన్‌లో రాణా డేట్స్ కూడా అడ్జెస్ట్ కాక పోవడం కూడా ఓ కారణమని వెల్లడించారు. రాణా ఈ సినిమా నుంచి తప్పుకోవడం వెనక మరే ఇతర కారణాలు, విబేధాలు లేవని, తమ మధ్య ఇప్పటికీ మంచి రిలేషన్స్ కొనసాగుతున్నాయని నిర్మాత చెప్పుకొచ్చారు.
రాణా కూడా ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా చెప్పారు. తమిళంలో నటించాలనే తన కోరిక ఇంకా కలగానే ఉందని, ప్రస్తుతం 'నా ఇష్టం' సినిమా డబ్బింగ్ జరుగుతోందని, ఇది పూర్తయ్యాక 'డిపార్ట్ మెంట్' చిత్రం షూటింగు కోసం ముంబై వెలుతున్నట్లు రాణా చెప్పకొచ్చాడు. మరో వైపు రాణా..క్రిష్ దర్శకత్వంలో 'కృష్ణం వందే జగ్దురుమ్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











