For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రానా నిర్ణయం అద్బుతం : ఎవరీ కోడి రామ్మూర్తి నాయుడు ??? (ఫొటో స్టోరీ)

  |

  మల్లయోధుడు మహవీర్ సింగ్ పొగాట్ కథతో సుల్తాన్ గా తెరపైకి వచ్చిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ భారీ కలెక్షన్స్ రాబట్టడానికి బాక్సాఫీస్ వద్ద కుస్తీ పడుతున్నాడు. ఇక ఇటువంటి సినిమానే అమీర్ దంగల్ సినిమాలో చేస్తున్నాడు. ఇటువంటి సినిమాలు తెలుగు పరిశ్రమలో కూడా రావాలని రానా కోరుకున్నాడు. స్వతహాగా క్రీడలు అంటే ఇష్టపడే రానా ప్రస్తుతం జరుగుతున్నా కబడ్డీ పోటీల కార్యక్రమంలో మాట్లాడుతూ....

  తాజాగా రానా ఓ సందర్భంలో మాట్లాడుతూ, విజయనగరానికి చెందిన ప్రముఖ మల్లయోధుడు 'కోడి రామ్మూర్తి నాయుడు' గురించి ప్రస్తావించాడు. 'కలియుగ భీముడు' గా పేరు ప్రఖ్యాతులను సంపాదించిన ఆయన గురించి వింటూ తాను పెరిగానని అన్నాడు. ఆయన పాత్రలో నటించాలని ఉందని చెప్పాడు.

  'స్కూల్ డేస్ లో బాగా ఆడిన ఆట కబడ్డీ..,తర్వాత కిక్ బాక్సింగ్ కూడా నేర్చుకున్నాను. అయితే దానికి చాలా టైం కేటాయించాలి. పైగా గాయాలు ఎక్కువ. దాంతో బాక్సింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేశా. బాక్సింగ్, రెజ్లింగ్ బాగా ఇష్టమైన ఆటలు అని చెబుతూ ఈ సందర్భంగా ప్రముఖ బాడీ బిల్డింగ్ ఛాంపియన్ కోడి రామ్మూర్తి నాయుడు పాత్రలో గనక నటిస్తే తన కల నిజమైనట్టే అని మనసులో మాట బయటపెట్టాడు

  సల్మాన్ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించింది. అదే సమయంలో అమీర్ హీరోగా తెరకెక్కిన దంగల్ పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు నిజ జీవిత కథలతో తెరకెక్కినవే. రెండు సినిమాల్లోనూ హీరోలు మల్లయోధులుగానే కనిపిస్తున్నారు.

  దీంతో అదే తరహా పాత్ర చేసేందుకు ఈ టాలీవుడ్ కండల వీరుడు ఆసక్తి కనబరుస్తున్నాడు.కుస్తీ పోటిల్లో కలియుగ భీమగా పేరు తెచ్చుకున్న విజయనగరానికి చెందిన కోడి రామ్మూర్తి నాయుడు జీవిత కథతో సినిమాను తెరకెక్కిస్తే అందులో నటించేందుకు తాను సిద్ధమంటూ ప్రకటించాడు రానా. రానానే స్వయంగా చేస్తానంటే దర్శక నిర్మాతలు ఊరుకుంటారా. త్వరలోనే రానా లీడ్ రోల్ లో కలియుగ భీమ పట్టాలెక్కే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.

  మహవీర్ సింగ్ పొగాట్

  మహవీర్ సింగ్ పొగాట్

  మల్లయోధుడు మహవీర్ సింగ్ పొగాట్ కథతో సుల్తాన్ గా తెరపైకి వచ్చిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ భారీ కలెక్షన్స్ రాబట్టడానికి బాక్సాఫీస్ వద్ద కుస్తీ పడుతున్నాడు. ఇక ఇటువంటి సినిమానే అమీర్ దంగల్ సినిమాలో చేస్తున్నాడు.

  బయో పిక్ ట్రెండ్

  బయో పిక్ ట్రెండ్

  మల్లయోధుల మీద ఇప్పుడు మరింత ఆసక్తి పెంచిన సినిమాలివి. బయో పిక్ ట్రెండ్ లో వచ్చిన అన్ని సినిమాల్లోనూ ఒక భిన్నమైన భారత దేశ ప్రాచీన పోరాట కళల మీదికి మరోసారి అందరి దృస్టినీ మళ్ళించాయి.

  బాలీవుడ్

  బాలీవుడ్

  బాలీవుడ్ లో తయారైన ఈ రెండు సినిమాల మీదా ఆ మల్లయోధుల పాత్రల మీదా మనసు పారేసుకున్నాడు భల్లాల దేవుడు రానా

  కోడి రామ్మూర్తి నాయుడు

  కోడి రామ్మూర్తి నాయుడు

  తాజాగా రానా ఓ సందర్భంలో మాట్లాడుతూ, విజయనగరానికి చెందిన ప్రముఖ మల్లయోధుడు 'కోడి రామ్మూర్తి నాయుడు' గురించి ప్రస్తావించాడు. 'కలియుగ భీముడు' గా పేరు ప్రఖ్యాతులను సంపాదించిన ఆయన గురించి వింటూ తాను పెరిగానని అన్నాడు. ఆయన పాత్రలో నటించాలని ఉందని చెప్పాడు.

  సుల్తాన్, దంగల్

  సుల్తాన్, దంగల్

  బాలీవుడ్ లో వచ్చిన సుల్తాన్ దంగల్ ఈ రెండు సినిమాలూ టాలీవుడ్ లో ఆలోచనల్ని రేకెత్తించాయి. తెలుగు వారిలో కూడా మల్లయోధులున్నారు. వారి గురించి సినిమా ఎందుకు తీయకూడదు అని హీరో రానా ఆలోచిస్తున్నాడు.

  కుస్తీ పోటీలకూ

  కుస్తీ పోటీలకూ

  హైదరాబాద్ లోనూ మల్లయోధులకూ, కుస్తీ పోటీలకూ పెద్ద చర్రిత్రే ఉంది. ధూల్‌పేట్‌ పరిసర ప్రాంతాల్లో అనేక వ్యాయామశాలలున్నాయి. లాలా తాలీమ్‌, మహారథి కరణ్‌ ఉస్తాద్‌ గులాబ్‌ వ్యాయామశాల, గండిహనుమాన్‌ తాలీమ్‌, బాలాజీ పహల్వాన్‌ తాలీమ్‌, సేవాదళ్‌ తాలీమ్‌, రహీంపురా జీహెచ్‌ఎంసీ వ్యాయామశాల, ధూల్‌పేట్‌ మినీ స్టేడియం, గాంధీబైటక్‌ తాలీమ్‌, బడాబంగ్లా తాలీమ్‌, భవానీ ఉస్తాద్‌ తాలీమ్‌లలో 20 మంది ఉస్తాద్‌లు తర్ఫీదు ఇస్తున్నారు. వీళ్ల వద్ద వద్ద 500 మంది మల్లయోధులు శిక్షణ పొందుతున్నారు.

  కోడి రామ్మూర్తి

  కోడి రామ్మూర్తి

  కోడి రామ్మూర్తి అంటే ఈ తరం వారికి తెలీకపోవచ్చు కానీ...నిన్నటి జనరేషన్ వరకూ బాగా సుపరిచితమైన పేరు. కుస్తీ పోటీల్లో ఎదుటి పోటీదారుని గడగడ వణికించి, చిత్తు చేసిన మల్లయుద్ధ యోధుడు కోడి రామమూర్తి.

  కోడి రామ్మూర్తి నాయుడు

  కోడి రామ్మూర్తి నాయుడు

  గట్టిగా ఊపిరి పీల్చుకుని కండలు బిగించి, తన ఛాతీకి చుట్టిన ఉక్కు తాళ్ళను తెంచేవారు. ఛాతీ మీదకు ఏనుగును ఎక్కించుకుని ఐదు నిముషాల పాటు నిలిపేవారు.
  రెండు కార్లను వాటికి కట్టిన తాళ్ళు రెండు చేతులుతో పట్టుకుని కదలకుండా ఆపేవారు.ఒంటి చేత్తో రైల్ ఇంజను ఆపిన ఘనుడు.21 సంవత్సరాల వయసులోనే ఇతడు రొమ్ముపై 1.5 టన్నుల భారాన్ని మోసేవాడు. తరువాత 3 టన్నుల భారాన్ని కూడా మోయగలిగాడు..

  బకింగ్ హామ్ ప్యాలెస్

  బకింగ్ హామ్ ప్యాలెస్

  ఆయన ఆ రోజుల్లో లండన్ కు వెళ్లి అక్కడ బకింగ్ హామ్ ప్యాలెస్ లో కూడా కుస్తీ పోటీలో తన సత్తా చాటుకున్నాడు. బ్రిటిష్ రాణి ఆయనకు ఇండియన్ హెర్క్యులెస్ అనే బిరుదు కూడా ఇచ్చింది.

  కోడి రామ్మూర్తి జీవితకథ

  కోడి రామ్మూర్తి జీవితకథ

  తెలుగువారికి గర్వకారణమైన కోడి రామ్మూర్తి జీవితకథను సినిమాగా తీయాలని, అందులో నటించాలని రానా అనుకుంటున్నాడట. బాలీవుడ్ సినిమాలతో పోటీగా కోడి రామ్మూర్తి లైఫ్ స్టోరీని తెరకెక్కించాలని రానా ఆలోచిస్తున్నాడు.

  రానా

  రానా

  రానా ఆలోచన మంచిదే. మనకు యుద్ధవీరులూ, మల్లయుద్ధ ప్రవీణులూ చాలామందే ఉన్నారు. అలాంటి వారిని తిరిగి మననం చేసుకోవడం అవసరం కూడా.

  English summary
  After Super success of Bollywood actor Salman Khan’s Sultan , based on life of a wrestler , Tollywood Big Boy Rana Daggubati is also trying similar plot.Sources says, Rana wants to play the iconic wrestler from Vizianagaram, Kodi Ramamurthy Naidu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X