అప్పుడు నితిన్, ఇప్పుడు రానా.. బాబోయ్ అంత పెద్ద రిస్కా..!

అక్కినేని యువ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇంకా కుదురుకోలేదు. చేసిన రెండు చిత్రాలు ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో తదుపరి చిత్ర విషయంలో తర్జన భర్జన పడుతున్నాడు. జనవరి 10 నే తన తర్వాతి చిత్రాన్ని ప్రకటిస్తానని తెలిపిన అఖిల్ సైలెంట్ అయిపోయాడు. నెక్స్ట్ మూవీ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా అఖిల్ తదుపరి దర్శకుడు ఎవరు అనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా రానా, అఖిల్ కు సంబందించిన వార్త ఒకటి ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది.

ఫస్ట్ మూవీతోనే నిరాశ

ఫస్ట్ మూవీతోనే నిరాశ

వివి వినాయక్ దర్శకతంలో వచ్చిన అఖిల్ చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. భారీ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన ఫలితం లేకపోయింది. అన్ని వర్గాల ప్రేక్షకులని నిరాశకు గురిచేస్తూ డిజాస్టర్ మూటగట్టుకుంది.

 హలొ అంతంత మాత్రమే

హలొ అంతంత మాత్రమే

అఖిల్ రెండవ చిత్రం హలొ. తొలిచిత్రం కంటే ఇది కాస్త పరవాలేదనిపించినా కమర్షియల్ గా మాత్రం వర్కౌట్ కాలేదు. అక్కినేని కుటుంబానికి మనం వంటి క్లాసిక్ చిత్రాన్ని అందించిన విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కథవరకు బాగానేఉన్నా ఈ చిత్రంలో ఎంటర్ టైనింగ్ అంశాలుతక్కువయ్యాయని అందువలనే ఏ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదని కామెంట్లు వినిపించాయి.

 సుకుమార్ తో అంటూ వార్తలు

సుకుమార్ తో అంటూ వార్తలు

కాగా అఖిల్ తరువాతి చిత్రానికి దర్శకుడు ఎవరనేదానిపై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన ఊహాగానాలు సాగుతున్నాయి. నాగచైతన్యకు 100 పర్సెంట్ లవ్ చిత్రం ద్వారా సూపర్ హిట్ ని ఆడించారు సుకుమార్. అఖిల్ ప్రస్తుతం ఆయన్నే నముకున్నాడట. మరో వైపుతమిళ దర్శకుడు సత్య పినిశెట్టి కూడా అఖిల్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నాడని సమాచారం.

 రానా ఆ పని చేస్తాడా

రానా ఆ పని చేస్తాడా

అఖిల్ తరువాత చిత్రాల గురించి ఫిలిం నగర్ లో మరో ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. అందేంటంటే అఖిల్ తదుపరి రెండు చిత్రాలని రానా నిర్మిస్తాడట. ఈ మేరకు నాగార్జున, సురేష్ బాబు మధ్య మంతనాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

నితిన్ పరిస్థితి ఏంటో తెలుసుగా

నితిన్ పరిస్థితి ఏంటో తెలుసుగా

రానా జాతీయ స్థాయి నటుడిగా ఎదుగుతున్న సమయంలో ఇలాంటి రిస్క్ ఎందుకనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బాహుబలి చిత్రం తరువాత రానాకు దేశం నలువైపుల నుంచి అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో కూడా రానా క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇలాంటి తరుణంలో నిర్మాతగా మారి రిస్క్ లో పడడం ఎందుకనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. అఖిల్ తొలి చిత్రాన్ని నితిన్ నిర్మించాడు. ఆ చిత్రం నితిన్ కు భారీ నష్టాలనే మిగిల్చిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X