»   » సైకో...... రానాను త్రిష అలా అందేంటి, అందుకేనా?

సైకో...... రానాను త్రిష అలా అందేంటి, అందుకేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియా స్టార్ హీరోయిన్ త్రిష ఈరోజు(మార్చి 4) 32వ పుట్టినరోజు వేడుక జరుపుకుంటోంది. నిన్న రాత్రే త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసాడు ఆమె క్లోజెస్ట్ ఫ్రెండ్ దగ్గుబాటి రానా. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఈ సంవత్సరం ఫెంటాస్టిక్ గా ఉండాలని విష్ చేసాడు. దీనికి త్రిష వెంటనే.... ‘థ్యాంక్యూ సైకో' అంటూ రిప్లై ఇచ్చింది. దీన్ని బట్టి ఇద్దరి మధ్య ఎంత క్లోజ్ నెస్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

రానాతో పాటు త్రిషకు ఆమె ప్రెండ్స్ చాలా మంది ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపారు. హీరోయిన్ తాప్సీ, నికీషా పటేల్, కార్తీక నాయర్, జయం రవి, నీరజ కోన, విశాల్, హన్సిక, చిన్మయి తదితరులంతా ఆమెకు పుట్టినరోజు విషెస్ తెలిపారు. అయితే వరుణ్ మణియన్ నుండి మాత్రం ఆమెకు విషెస్ రాలేదు. దీన్ని బట్టి వీరి నిశ్చితార్థం రద్దయినట్లు మరింత బలంగా వినిపిస్తోంది.

హీరోయిన్ త్రిష ఎంగేజ్మెంట్ వరుణ్ మణియన్ తో ఆ మధ్య జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి ఎంగేజ్మెంట్ రద్దయిందని, ఇద్దరి మధ్య విబేధాలొచ్చాయని, ఇక వీరు పెళ్లి చేసుకునే అవకాశం లేదని వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై ఇటు త్రిష గానీ, అటు వరుణ్ మణియన్ గానీ స్పందించడం లేదు. వీరు మౌనంగా ఉండటాన్ని బట్టి వీరి ఎంగేజ్మెంట్ పెళ్లి వరకు వెళ్లక ముందే పెటాకులైందని స్పష్టమవుతోంది.

వరుణ్ మణియన్ ప్రొడక్షన్ హౌస్ సినిమా రిజెక్ట్ చేసినప్పటి నుండే ఇద్దరి మధ్య విబేధాలు మొదలయ్యాయనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. గత కొంతకాలంగా త్రిష వరుణ్ మణియన్ కు దూరంగానే ఉంటోంది. ప్రస్తుతం త్రిష తన చేతికి ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్ కూడా తీసి పక్కన పడేసిందని టాక్. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.

Rana Wishes Trisha On Her Birthday

ఇటీవల వరుణ్ మణియన్...సోదరి వివాహ వేడుకకు కూడా త్రిష హాజరు కాలేదు. మరి ఆ సమయంలో ఏమైనా షూటింగులో బిజీగా ఉందా? అంటే అదీ లేదు. తన స్నేహితులతో కలిసి చెన్నైలో పార్టీల్లో మునిగి తేలిందట. ఈ పరిణామాలు ఇద్దరూ విడిపోయారనే వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది.

వరుణ్ తో విడిపోయిన తర్వాత .....ఎప్పటి లాగే త్రిష తన సినిమా షూటింగులకు వెళ్లడం, ఖాళీ సమయాల్లో స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకుంటూ లైఫ్ లాగించేస్తోందట.

Read more about: trisha, rana, రానా, త్రిష
English summary
Rana Daggubati surprised everyone when he took to twitter and wished his supposed ex-girlfriend, Trisha Krishnan, on her birthday. The Chennai beauty is on a holiday with her girl gang to celebrate the special day.
Please Wait while comments are loading...