»   » రామ్ చరణ్ ని కాదన్నాడనే రాణాతోనే..

రామ్ చరణ్ ని కాదన్నాడనే రాణాతోనే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్, క్రిష్ ల కాంబినేషన్ లో ఓ చిత్రం త్వరలో ప్రారంభం కానుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రచ్చ బిజీలో ఉన్న రామ్ చరణ్ ఆ తర్వాత చిత్రం కూడా మాస్ ఎంటర్టైనర్ చేయాలనే తలంపుతో క్రిష్ ని కాదనేసాడు. వేదం, గమ్యం వంటి ప్రయోగాత్మక చిత్రాలు చేసి పేరు తెచ్చుకున్న క్రిష్ డైరక్షన్ లో చేస్తే పేరు రాదు, డబ్బు రాదని రామ్ చరణ్ ఫీలై సారి చెప్పాడట. దాంతో వెంటనే క్రిష్ ఆలస్యం చేయకుండా రాణాని కలిసి కథ వినిపించేసి ఓకే చేయించుకున్నాడు. నేనూ నా రాక్షసి తరువాత రాణా 'నా ఇష్టం' అంటూ చిత్రం చేస్తున్నాడు.

ప్రకాష్ తోలేటి దర్శకత్వంలో రూపొందుతున్న నా ఇష్టం చిత్రం మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. సింహా నిర్మాతలు నిర్మించే ఈ చిత్రం రీసెంట్ గా మలేషియా షెడ్యూల్ పూర్తిచేసుకువచ్చింది. జెనిలియా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ కామిడీ గా రూపొందుతోంది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం రచ్చ చిత్రం చేస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. అంతేగాక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో డిపార్టమెంట్ అనే చిత్రం ఒకటి కమిటయ్యారు.

English summary
Daggubati Rana is currently doing ‘Naa Ishtam’ movie in Tholeti Prakash direction and a Hindi film ‘Department’ in maverick Ram Gopal Varma direction. Apart from these films he recently has okayed the film of director Krish.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu