ముద్దుల్లో హష్మీని బీట్ చేస్తున్న రణబీర్
బాలీవుడ్‌లో లిప్‌లాక్ ముద్దు సీన్లు అంటే ముందుగా గుర్తుచ్చేది ఇమ్రాన్ హస్మి. గత పదేళ్లుగా వరుస సినిమాల్లో ముద్దు సీన్లతో రెచ్చి పోతూ సీరియల్ కిస్సర్‌గా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ హస్మి వీలైనంత వరకు ఆ ఇమేజ్‌ను నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే ఆయనతో సినిమాలు తీసే దర్శకులు అతని కిస్సింగ్ ఇమేజ్‌నే దృష్టిలో పెట్టుకుని కథలు తయారు చేస్తుండటంతో తక్కువలో తక్కువ ఒక్క సీన్లోనైనా అలాంటి సీన్లు చేయక తప్పడం లేదతడికి.
అయితే...ఇప్పడు ఇమ్రాన్‌కు కాస్త ఉపశమనం లభించే సమయం ఆసన్నమైంది. బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ ముద్దు సీన్ల విషయంలో ఇప్పడు ఇమ్రాన్ హస్మితో పోటీ పడుతున్నాడు. తను వరుస సినిమాల్లో ఘాటైన ముద్దులతో బాలీవుడ్ యువతలో అలజడి సృష్టిస్తున్నాడు. రాజ్‌నీతి సినిమాలో ఓ ఇంగ్లీష్ భామతో ముద్దుల్లో మునిగిన తేలిసన రణబీర్, అంజానా అంజానాలొ ప్రియాంక లిప్స్‌తో ఓ ఆటాడుకున్నాడు. తాజాగా 'రాక్ స్టార్" సినిమాలో ఈ పోరగాడు మరింత రెచ్చియాడు. పాక్ ముద్దుగుమ్మ నర్గీస్ తో ఘాటన చుంబన సీన్లతో ముద్దుల తుఫాన్ సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు.
ఏది ఏమైతేనేం....తనొక్కడికి మాత్రమే కిస్సుల కింగ్ అనే ఇమేజ్ ఉండటాన్ని ఇబ్బందిగా ఫీలవుతున్న ఇమ్రాన్ హస్మి, తనతో పాటు కిస్సర్ల లిస్టులో రణబీర్ కూడా చేరడంపై చాలా సంతోషంగా ఉన్నాడట.


Click it and Unblock the Notifications