బిగ్ స్క్రీన్‌పై రోమాన్స్‌కు సిద్దమైన అలనాటి జంట
సినిమా ఇండస్ట్రీలో కొన్ని జంటలు ప్రత్యేకం. అలా ప్రత్యేకమైన జంటల్లో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ జంట రణభీర్ కపూర్, దీపికా పదుకొణె. కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయిన సంగతి అందరికి తెలిసిందే. ఐతే సడన్‌గా వీరిద్దరూ మరలా స్క్రీన్ మీద రొమాన్స్ చేయడానికి సిద్దమయ్యారు. వీరిద్దరిని కలిపిన ఆ మహాత్ముడు ఎవరా అని అనుకుంటున్నారా.. ఇంకెవరు బాలీవుడ్ బాద్ షా దోస్త్ కరణ్ జోహార్. కరణ్ జోహార్ స్వీయ ప్రోడక్షన్‌లో రణభీర్ కపూర్, దీపికా ఇద్దరూ రొమాన్స్ చేయనున్నారని సమాచారం.
వీళ్ళిద్దరూ కలసి నటిస్తున్న చిత్రం "యహా జవానీ హాయ్ దీవానీ". ఈ చిత్రానికి గతంలో వేక్ అప్ సిద్ సినిమాకు దర్శకత్వం వహించిన అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కరణ్ జోహార్ తన మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. గతంలో దీపికా, రణభీర్ ఇద్దరూ డేటింగ్ చేసుకున్నప్పటికీ 2009లో కొన్ని అనివార్యకారణాల వల్ల విడిపోవడం జరిగింది.
వీరిద్దరూ కలసి చివరగా నటించిన చిత్రం "బచనా యే హసీనా" 2008వ సంవత్సరంలో విడుదలైంది. ఇక కరణ్ జోహార్ ప్రస్తుతం "స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్" అనే సినిమా నిర్మించడంలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్‌కి అలియా బట్, సిద్దార్ద్ మల్హోత్రా, వరుణ్ ధావన్‌లు హీరోలుగా పరిచయం కానున్నారు.


Click it and Unblock the Notifications











