బహిరంగంగా పాడు పని.... - దీపిక ప్రియుడికి జరిమానా!
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో, దీపిక పడుకొనె మాజీ ప్రియుడు రణబీర్ కపూర్‌కి ఉదయ్ పూర్ కోర్టు జరిమానా విధించింది. రణబీర్ బహిరంగంగా పాడుపనికి పాల్పడటమే ఇందుకు కారణం. అతను చేసిన పాడుపని ఏమిటంటే...పబ్లిక్ ప్లేసులో పొగ త్రాగటడమే.
రణబీర్ కపూర్, దీపిక పడుకొనె జంటగా 'యే జవాని హై దివాని' అనే చిత్రం రూపొందుతోంది. షూటింగులో భాగంగా మే నెలలో రాజస్థాన్‌లో చిత్రీకరణ జరిపారు. ఈ క్రమంలో మే 28న రణబీర్ అక్కడ పొగ త్రాగారు. రాజస్థాన్‌లో బహిరంగ ధూమపానంపై నిషేదం ఉన్నప్పటికీ రణబీర్ ఖాతారు చేయలేదు. ఈ దృశ్యం కాస్తా అక్కడి ఫోటోగ్రాఫర్లకు చిక్కి స్థానిక మీడియాలో వచ్చాయి.
ఈ నేపథ్యంలో హరీష్ వైష్ణవ్ అనే వ్యక్తి ఉదయ్‌పూర్ లోని లోకల్ కోర్టులో కంప్లైంట్ దాఖలు చేసారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ జరిపిన కోర్టు రణబీర్ కపూర్ కి రూ. 200 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కూడా రాజస్థాన్‌లో బహిరంగ ధూమపానం చేసి జరిమానకు గురైన విషయం తెలిసిందే.
'యే జవాని హై దివాని' చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈచిత్రం మార్చి 29, 2013న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











