»   » సినీ స్టార్ల సరదా కాస్త...గొడవకు దారి తీసింది (ఫోటోస్)

సినీ స్టార్ల సరదా కాస్త...గొడవకు దారి తీసింది (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, అభిషేక్ బచ్చన్, అర్మాన్ జైన్, బంటీ వాలియా ఇటీవల చారిటీ కోసం ఓ ఫుట్ బాల్ మ్యాచ్ ఆడారు. ‘ప్లే ఫర్ హుమానిటీ' పేరుతో ఈ గేమ్ జరిగింది. సినీ స్టార్లంతా చారిటీ, సరదా కోసమే ఈ మ్యాచ్ ఆడారు. అయితే ఈ మ్యాచ్ కాస్త గొడవకు దారి తీసింది. అభిషేక్ బచ్చన్ నిర్మాత బంటీ వాలియాతో గొడవ పెట్టుకున్నాడు.

వివాదం తీవ్రరూపం దాల్చింది. ఇంకాస్త ఉంటే ఇద్దరూ ఒకరిపై ఒకరు చేయి చేసుకునే వారేమో. అయితే వెంటనే రణబీర్ కపూర్ కలుగజేసుకుని గొడవను ఆపే ప్రయత్నం చేసాడు. సరదాగా మొదలు పెట్టిన ఆట ఇలా వివాదానికి దారి తీయడం ఇపుడు బాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. అయితే తర్వాత మళ్లీ ఇద్దరూ సరదాగా నవ్వుతూ కనిపించారు. అయితే వీరి గొడవ ఫుట్ బాల్ మ్యాచ్ కు సంబంధించినదే అయి ఉంటుందని తెలుస్తోంది.

గతంలో బంటీ వాలియా.... మాన్యతా దత్ బర్త్ డే పార్టీ (2011)లో సల్మాన్ ఖాన్ తో గొడవ పడ్డారు. బంటీ వాలియా, సల్మాన్ ఖాన్ బ్రదర్ బిజినెస్ భాగస్వాములు. సల్మాన్ ఖాన్ చిత్రాలైన ‘ప్యార్ కియాతో డర్నా క్యా', ‘హలో బ్రదర్స్' చిత్రాలను నిర్మించాడు కూడా.

స్లైడ్ షోలో ఫుట్ బాల్ మ్యాచ్ కు సంబంధించిన ఫోటోలు.....

అభిషేక్ బచ్చన్-రణబీర్
  

అభిషేక్ బచ్చన్-రణబీర్

బంటీ వాలియాతో గొడవకు వెలుతున్న అభిషేక్ బచ్చన్‌ను సముదాయిస్తున్న రణబీర్ కపూర్.

అభిషేక్-బంటీ
  

అభిషేక్-బంటీ

గొడవ తర్వాత అభిషేక్ బచ్చన్, బంటీ వాలియా ఇలా...

ఏమిటో ఆ గొడవ
  

ఏమిటో ఆ గొడవ

బంటీ వాలియా, రణబీర్ కపూర్ మధ్య అసలు ఏం గొడవ జరిగింది అనేది హాట్ టాపిక్ అయింది.

అభిషేక్ బచ్చన్, బంటీ
  

అభిషేక్ బచ్చన్, బంటీ

చారిటీ మ్యాచ్ సందర్భంగా అభిషేక్ బచ్చన్, బంటీ వాలియా ఇలా...

కోపం..
  

కోపం..

బంటీ వాలియాపై అభిషేక్ బచ్చన్ కోపోద్రేకం.

రణబీర్-బంటీ
  

రణబీర్-బంటీ

బంటీ వాలియాను సముదాయిస్తున్న రణబీర్ కపూర్.

జూనియర్ బచ్చన్
  

జూనియర్ బచ్చన్

ఈ గొడవకు సంబంధించిన ఫోటోలు, అభిషేక్ బచ్చన్ గొడవకు సంబంధించిన దృశ్యాలు హాట్ టాపిక్ అయ్యాయి.

మ్యాచ్ దృశ్యాలు
  

మ్యాచ్ దృశ్యాలు

ఫుట్ బాల్ మ్యాచ్ కు సంబంధించిన దృశ్యాలు.

చారిటీ
  

చారిటీ

రణబీర్ కపూర్, అభిషేక్ బచ్చన్, అర్మాన్ జైన్, బంటీ వాలియా తదితరులు ఈ చారిటీ మ్యాచ్ లో పాల్గొన్నారు.

రణబీర్ కపూర్
  

రణబీర్ కపూర్

ఒకవేళ రణబీర్ కపూర్ ఇద్దరినీ ఆపి ఉండక పోతే ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వారేమో?

 

 

Please Wait while comments are loading...