»   » డ్రగ్స్ వాడాను, నిజం ఒప్పుకున్న స్టార్ హీరో...ఏకంగా షూటింగులోనే!

డ్రగ్స్ వాడాను, నిజం ఒప్పుకున్న స్టార్ హీరో...ఏకంగా షూటింగులోనే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

డ్రగ్స్ పేరు వింటే ముందుగా గుర్తొచ్చేది సినిమా స్టార్లే..... కొందరు సినిమాల్లో డ్రగ్ అడిక్ట్‌గా నటించడం, కొందరు రియల్ లైఫ్‌లో డ్రగ్స్ తీసుకోవడం, ఆయా కేసుల్లో పోలీసులకు పట్టుబడటం లాంటివి అందుకు కారణం కావొచ్చు.

తాజాగా తెలుగు సినీ పరిశ్రమను డ్రగ్స్ కేసు కుదిపేస్తున్న వేళ.... ఓ స్టార్ హీరో ఇచ్చిన స్టేట్మెంట్ హాట్ టాపిక్ అయింది. అయితే ఆ స్టార్ తెలుగు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదు. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యువ హీరో. అతడు సినిమా షూటింగుల్లో సీన్ పండేందుకు కూడా తాను డ్రగ్స్ వాడానని చెప్పడం గమనార్హం.

ఆ స్టార్ హీరో రణబీర్

ఆ స్టార్ హీరో రణబీర్

తాను గతంలో డ్రగ్స్‌ వాడానని అంగీకరించాడు బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌కపూర్‌. చదువుకునే రోజుల్లో తనకు డ్రగ్స్‌ అలవాటు ఉండేదని, చిన్న వయసులోనే తాను డ్రగ్స్‌కు బానిస అయ్యానని తెలిపారు.

ఇపుడు మారాను

ఇపుడు మారాను

డ్రగ్స్ కారణంగా తన జీవితం నాశనం అయ్యే పరిస్థితుల్లో ఇంట్లో వారు, స్నేహితులు ఇచ్చిన కౌన్సిలింగ్‌తో అవి వాడటం ఎంత తప్పో తెలుసుకుని పూర్తిగా మానేశానని రణబీర్ కపూర్ చెప్పుకొచ్చారు.

Drugs Scandal : Actor Nandu Emotional Convince about his Drug Addicted Issue
ఆ సినిమాలో సీన్ కోసం డ్రగ్స్ వాడాను

ఆ సినిమాలో సీన్ కోసం డ్రగ్స్ వాడాను

డ్రగ్స్ మానేసిన తర్వాత ఓ సారి సినిమా షూటింగులో సీన్ పండేందుకు చాలా తక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకున్నట్లు రణబీర్ కపూర్ తెలిపారు. ‘రాక్‌స్టార్‌' సినిమాలోని ఓ కీలకమైన సన్నివేశం కోసం డ్రగ్స్‌ తీసుకున్నట్టు అంగీకరించాడు.

సినీ రంగంలో ఇదీ పరిస్థితి

సినీ రంగంలో ఇదీ పరిస్థితి

రణబీర్ కపూర్ చెబుతున్న విషయాలను బట్టి కొన్ని సార్లు సినిమాల్లో సీన్లు పండించడానికి కూడా కొందరు నటులు డ్రగ్స్ తీసుకుంటారని స్పష్టమవుతోంది. సినిమా కోసం, తమ కెరీర్ కోసం తమ జీవితాన్ని పనంగా పెట్టి డ్రగ్స్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు.

ఒత్తిడి భరించలేకేనా?

ఒత్తిడి భరించలేకేనా?

సినిమా స్టార్స్ కావాల్సినంత డబ్బు, పేరు పలుకుబడితో చాలా హ్యాపీగా ఉన్నట్లు కనిపిస్తారు. అయితే వారిపై రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి. పని ఒత్తిడి, కెరీర్ పరమైన సమస్యలు, సినిమా హిట్టు ప్లాపుల ఎఫెక్ట్ ఇలా చాలా ఉంటాయి. ఆ ఒత్తిడి భరించలేకే కొందరు డ్రగ్స్ అలవాటు చేసుకుంటారని టాక్.

గతంలో సంజయ్ దత్

గతంలో సంజయ్ దత్

బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ కూడా గతంలో డ్రగ్ ఎడిక్ట్. ప్రస్తుతం సంజయ్ దత్ బయోపిక్ మూవీలో రణబీర్ కపూర్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సంజయ్ దత్ డ్రగ్ ఎడిక్షన్‌కు సంబంధించిన సీన్లు కూడా ఉంటాయని రణబీర్ కపూర్ ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపారు.

ఫర్దీన్ ఖాన్

ఫర్దీన్ ఖాన్

బాలీవుడ్లో డ్రగ్స్ వ్యసనానికి బానిసైన వారిలో ఫర్దీన్ ఖాన్ పేరును ప్రముఖంగా చెప్పుకోవచ్చు. గతంలో ఈ నటుడు డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ అయ్యాడు కూడా.

English summary
Alcohol, drugs, and depression seem to be a prominent part of a film industry. And it is indeed. This list of Bollywood actors, who been addicted to alcohol and drugs, will leave you all shocked. Ranbir Kapoor is also one of them. He was badly on drugs while he was shooting for his film ‘Rockstar’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu