Brahmastra First Review: బ్రహ్మాస్త్రం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. అదే కొంపముంచిందట..

బాలీవుడ్ క్యూట్​ఫుల్​ కపుల్​గా పేరు తెచ్చుకున్నారు రణ్​బీర్​ కపూర్, అలియా భట్. వీరిద్దరి ప్రేమ, పెళ్లి ఎంత హాట్​ టాపిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే వీరిద్దరూ ఫస్ట్​ టైమ్​ ఆన్​స్క్రీన్​ జోడీగా వస్తున్న చిత్రం బ్రహ్మాస్త్రం. విజువల్ ఫాంటసీగా తెరకెక్కిన ఈ సినిమాకు అయాన్​ ముఖర్జీ దర్శకత్వం వహించారు. అలాగే బ్రహ్మాస్త్రం చిత్రానికి దక్షిణాన సమర్పకుడిగా దర్శక ధీరుడు రాజమౌళి వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి ప్రమోషన్స్​ను భారీగానే చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే బ్రహ్మాస్త్రం మూవీ ఫస్ట్​ రివ్యూ వచ్చేసింది.

అత్యాధునిక సాంకేతితతో..

అత్యాధునిక సాంకేతితతో..

భారతదేశ చరిత్రలో భారీ బడ్జెట్​, అత్యాధునిక సాంకేతికతతో తెరకెక్కించిన మూవీ బ్రహ్మాస్త్ర. తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో విడుదల చేస్తున్నారు. దక్షిణాది భాషల్లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి డిస్ట్రిబ్యూట్​ చేస్తున్నారు. స్టార్ స్టూడియోస్​, ధర్మ ప్రొడక్షన్స్​, ప్రైమ్ ఫోకస్​, స్టార్​ లైట్ పిక్చర్స్​ సంయుక్తంగా నిర్మిస్తున్న బ్రహ్మాస్త్రం సినిమాకు భారీగానే ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

చీఫ్​ గెస్ట్​గా యంగ్​ టైగర్​ ఎన్టీఆర్..

చీఫ్​ గెస్ట్​గా యంగ్​ టైగర్​ ఎన్టీఆర్..

హైదరాబాద్​లో జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్​కు యంగ్​ టైగర్​ జూనియర్ ఎన్టీఆర్​ను ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. అంతేకాకుండా బుల్లితెరపై అత్యధిక పాపులారిటీతో దూసుకుపోతున్న బిగ్​బాస్​ షో, క్యాష్​ ప్రోగ్రామ్​లలో బ్రహ్మాస్త్ర టీమ్​ పాల్గొని సందడి చేసింది. ఇక ఏ సినిమాకు చేయని విధంగా ఈ చిత్రం ప్రమోషన్స్​లో రాజమౌళి యాక్టివ్​గా పాల్గొనడం విశేషం.

ఫస్ట్​ రివ్యూ..

ఫస్ట్​ రివ్యూ..

అయితే ఈ మూవీ హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్​గా సెప్టెంబర్​ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది బ్రహ్మాస్త్రం చిత్రం. ఈ మూవీ ఎలా ఉంటుందనే అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మాస్త్రం ఫస్ట్​ రివ్యూ రానే వచ్చేసింది. ఈ రివ్యూను ప్రముఖ సెన్సార్ సభ్యుడు, విశ్లేషకుడు అయిన ఉమర్​ సంధు ఇచ్చాడు. బ్రహ్మాస్త్రం చిత్రాన్ని వీక్షించిన ఆయన తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

భారీ అంచానాలు, కానీ..

భారీ అంచానాలు, కానీ..

''బ్రహ్మాస్త్రం చిత్రం అన్ని విధాలుగా చాలా భారీ సినిమా. భారీ తారాగణం. భారీ కాన్వాస్​. ఎస్​ఎఫ్​ కోసం భారీగా ఖర్చు. భారీగా ప్రమోషన్స్​. భారీ అంచానాలు. కానీ, బాధాకరం ఏంటంటే ఈ భారీ అంచనాలే నిరుత్సాహపరిచాయి. నిజానికి ఇది ఒక యావరేజ్​ చిత్రం.

బాలీవుడ్​లో చాలా అరుదు..

బాలీవుడ్​లో చాలా అరుదు..

నిజానికి బాలీవుడ్​లో ఫాంటసీ, అండ్వెంచర్​ సినిమాలు చాలా అరుదు. ఒక అద్భుతమైన ఊహా లోకాన్ని సృష్టించిన అయాన్ ముఖార్జీ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. కానీ, బ్రహ్మాస్త్రం సినిమా స్క్రీన్​ ప్లే, కథ పూర్తి యావరేజ్​గా ఉన్నాయి. ఇంకా కొన్నిసార్లు గందరగోళంగా కూడా ఉంది'' అని చెబుతూ 5కు 2.5 స్టార్ రేటింగ్​ ఇచ్చాడు ఉమర్ సంధు.

భారీ క్యాస్టింగ్​..

భారీ క్యాస్టింగ్​..

మరి ఇక థియేటర్లలో చూసే ప్రేక్షకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. కాగా ఈ చిత్రంలో రణ్​బీర్​ కపూర్​, అలియా భట్​తోపాటు బాలీవుడ్​ బిగ్​బి అమితాబ్ బచ్చన్​, గ్లామరస్​ బ్యూటీ మౌనీ రాయ్​, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటించిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X