కస్టమ్స్ కేసులో ఇరుక్కున్న యంగ్ హీరో
రణబీర్ లండన్‌నుంచి శుక్రవారం తెల్లవారుఝామున 12.30 గంటలకు ఛత్రపతి శివాజి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో దిగారు. అధికారులు, విమానాశ్రయ సిబ్బందికి మాత్రమే అనుమతి ఉన్న మార్గంలో రణబీర్ బయటకు వెళుతుండటంతో అతనిని ఆపి, తనిఖీ చేశామని కస్టమ్స్ శాఖ డిప్యూటీ కమిషనర్ సమీర్ వాంఖేడే చెప్పారు.
పెర్‌ఫ్యూమ్‌లు, దుస్తులు, పాదరక్షలు వంటి దాదాపు లక్షరూపాయల ఖరీదు చేసే విదేశీ వస్తువులను అతని లగేజ్‌లో కనుగొన్నామని, ఇవి కస్టమ్స్‌కు వెల్లడించాల్సిన వస్తువులని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలడంతో అతనిని నిర్బంధంలోకి తీసుకున్నామని చెప్పారు.
నియమ, నిబంధనలు తనకు తెలియవని రణబీర్ చెప్పినట్లు తెలిపారు. 40 నిమిషాలపాటు అతనిని నిర్బంధంలో ఉంచామని, రు.60,000 జరిమానా విధించామని చెప్పారు. జరిమానా కట్టడంతో అతను తీసుకొచ్చిన విదేశీ వస్తువులతోసహా వదిలేశారు. ఒక సినిమా షూటింగ్‌కోసం లండన్ వెళ్ళినట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications












