రెడ్‌లైట్ ఏరియాలో యంగ్ స్టార్ హీరో
ముంబైలోని రెడ్ లైట్ ఏరియా లో ఇటీవల చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ అందరికీ కనిపించి ఆశ్చర్యపరిచారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం రాక్‌స్టార్ షూటింగ్‌ని అక్కడ ప్లాన్ చేశారు. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో వేశ్యల కోసం రణబీర్ పాట పాడే సందర్భం ఒకటుంది. కావున భారీ ఎత్తున సెక్స్ వర్కర్లు ఈ పాటలో ప్రేక్షకులుగా నటించాల్సి ఉండటంతో, ముందుగా జూనియర్ ఆర్టిస్టులతో తీద్దామనుకున్నారట ఇంతియాజ్. అయితే నిజమైన సెక్స్ వర్కర్లతో ఈ సీన్ తీస్తే పండుతుందని భావించిన ఆయన రెడ్ లైట్ ఏరియాకి వెళ్లి, అక్కడివారితో సంప్రతింపులు జరిపారట. ఆ వేశ్యావాటికలో ఉన్నవారికి రణబీర్‌ని చూడబోతున్నామన్న ఆనందం ఒకవైపు ఉన్నప్పటికీ మరోవైపు సినిమాలో నటిస్తే, బహిరంగంగా తాము అందరికీ కనిపిస్తామనే సంశయం వారిలో ఉండటంతో.. ఇంతియాజ్ ప్రతిపాదనను అంగీకరించడానికి వెనుకడుగు వేశారు.
ఈ నేపథ్యంలోనే రణబీర్ ఆ రెడ్‌లైట్ ఏరియాకి వెళ్లి, అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడి, వారిలో ఉన్న బిడియాన్ని, బెరుకుతనాన్ని పోగొట్టారట. దాంతో సినిమాలో నటించడానికి వారందరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సెక్స్ వర్కర్లు తనని చుట్టుముట్టగా, గిటార్ వాయిస్తూ.. రణబీర్ పాట పాడే విధంగా ఇంతియాజ్ అలీ చిత్రీకరించారు. ఈ షూటింగ్ పూర్తయిన తర్వాత కొంతమంది అమ్మాయిలు రణబీర్‌తో ఫొటో దిగడంతో పాటు, ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నారు. అనంతరం ఈ చిత్రం విజయం సాధించాలని శుభాకాంక్షలు కూడా అందజేశారు. అలాగే రాక్‌స్టార్ యూనిట్ సభ్యులకు టీ, రొట్టె కూడా ఇచ్చి తమ ఆతిథ్యం స్వీకరించమని కోరారు. ఆ విన్నపాన్ని మన్నించి.. రొట్టె ఆరగించి, టీ తాగి ఈ యూనిట్ సభ్యులు వారిని ఆనందపరిచారు. సమాజంలో తమను చీడ పురుగులను చూసినట్లు చూస్తున్న నేపథ్యంలో ఈ విధమైన ఆదరణను ఊహించని సదరు మహిళలు చెమ్మగిల్లిన కళ్లతో రాక్‌స్టార్ బృందానికి వీడ్కోలు పలికారని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











