»   » సందడి చేసిన రణబీర్, రాణా, చోటా భీమ్(ఫోటోలు)

సందడి చేసిన రణబీర్, రాణా, చోటా భీమ్(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: లలిత కళాతోరణంలో 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు గురువారం కన్నుల పండువగా మొదలయ్యాయి. బాలీవుడ్ కథా నాయకుడు రణబీర్ కపూర్ నృత్య ప్రదర్శన, సంగీత దర్శకుడు గుల్జార్, క్యారెక్టర్ ఆర్టిస్టు అమోల్ పాలేకర్, టాలీవుడ్ యువ కథా నాయకుడు దగ్గుబాటి రానా తదితర సినీ ప్రముఖులు చలన చిత్రోత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

వారం రోజుల పాటు సాగే ఈ ఉత్సవంలో బాలలు భారత, అంతర్జాతీయ సినిమాలను వీక్షించనున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు గుల్జార్ మాట్లాడుతూ ప్రసంగాలకు బదులు చలన చిత్రోత్సవాల్లో మరింత మంది బాలల భాగస్వామ్యంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. బాలీవుడ్ కథా నాయకుడు రణబీర్ కపూర్, బాల నటులు దర్షీల్ సఫారీ, సలోనీ డయనీ ఒక జానపద గీతానికి నృత్యం చేశారు.

అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో చూద్దాం....

రణబీర్ డాన్స్

రణబీర్ డాన్స్


లలిత కళాతోరణంలో 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో చిన్నారులతో కలిసి డాన్స్ చేస్తున్న బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్.

రణబీర్-రాణా

రణబీర్-రాణా


బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, టాలీవుడ్ హీరో రాణా 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో ఇలా సందడి చేసారు. ఇద్దరూ కలిసి ‘యే జవానీ హై దివానీ' అనే చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.

రణబీర్

రణబీర్


18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో భాగంగా ‘ది గోల్డెన్ ఎలిఫెంట్' పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతున్న రణబీర్ కపూర్.

చోటా భీమ్

చోటా భీమ్


పిల్లలకు ఇష్టమైన చోటా భీమ్ సినిమాలోని క్యారెక్టర్ల వేషధారణంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో కంటి సమస్యలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసారు.

చోటా భీమ్ నిర్మాతలు

చోటా భీమ్ నిర్మాతలు


కంటి సమస్యల అవగాహన కార్యక్రమానికి ‘చోటా భీమ్' కార్టూన్ నిర్మాతలు గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సంస్థవారు సహకారం అందించారు.

English summary
Ranbir Kapoor hogs the limelight at 18th International Children's Film Festival.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu