అవును ఆమె మీద నా ఒక్కడికే హక్కుంది: హీరో సంచలన వ్యాఖ్యలు పాత లవర్ సంగతి కూడా

రణ్‌బీర్‌, కత్రినాలది చాలా లాంగ్ లవ్ స్టొరీ. దాదాపు ఆరేళ్ళు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిందీ జంట. ముంబాయి లో ఓ విలాసవంతమైన ఇల్లు అద్దెకు తీసుకొని డేటింగ్ పేరుతో కాపురం కూడా పెట్టారు. త్వరలోనే పెళ్లి అన్నారు . మరి ఇంతలో ఏమైందో ..బ్రేక్ చేసుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు. ఈ విషయంలో ఎప్పుడూ పెదవి విప్పని రన్ బీర్ తాజాగా తన సైలెన్స్ ను బ్రేక్ చేశాడు. తొలిసారి బ్రేక్ అప్ గురించి మాట్లాడాడు. కత్రినా - రణ్ బీర్ ల బ్రేకప్ గురించి ఇప్పటికే బాలీవుడ్ జనాలు కథలు కథలుగా చెప్పుకుంటున్న దశలో..

"కత్రినా నాకు చాలా ప్రత్యేకమైంది.. అమ్మానాన్నల తర్వాత నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఆమె.. బ్రేకప్ తనను నన్నూ బాగా అప్ సెట్ చేసింది.. నేను ఇప్పటివరకూ ఎక్కువగా తాగేవాడిని కానీ నా ప్రేయసి కోసం మానేయాలనుకుంటున్నాను" అని రణ్ బీర్ వ్యాఖ్యానించడంతో మరోసారి ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. కత్రినా కైఫ్ తో బ్రేకప్ తర్వాత బాలీవుడ్ లవర్ బోయ్ రణ్‌బీర్ కపూర్ కొత్త గాళ్ ఫ్రెండ్ ను సెలెక్ట్ చేసుకునే పనిలో బిజీగా మారిపోయాడు. ఈ క్రమంలోనే కొన్నిరోజుల క్రితం సౌత్ బ్యూటీ శృతి హాసన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అదంతా పుకారే అని తేలిపోవడంతో శ్రీలంక సుందరి జాక్వెలీన్ ఫెర్నాండెజ్ సీన్ లో ప్రవేశించింది.

Ranbir Kapoor interesting Comments On Jacqueline

కేట్ తో విడిపోయాక బాబు ఈ అమ్మడితోనే క్లోజ్ గా ఉంటున్నాడని, ఇద్దరూ కలిసి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తున్నారని వార్తలు షికారు చేశాయి. ఇదే విషయమై రణ్‌బీర్ లేటెస్ట్ గా స్పందించాడు. కొత్త సినిమా 'యే దిల్ హై ముష్కిల్' ప్రమోషన్స్ లో భాగంగా ఓ రియాల్టీ షోకు హాజరైన ఈ 'బర్ఫీ' స్టార్ కు జాక్వెలీన్ తో ఉన్న అనుబంధం గురించి చెప్పండి అన్న ప్రశ్న ఎదురైంది. దీంతో ఒన్ సైడ్ లవ్ గురించే కాక, తన రూమర్డ్ గాళ్ ఫ్రెండ్ గురించీ ఆసక్తికర వివరాలు చెప్పాడు.

'వన్‌ సైడ్‌ ప్రేమకి ఉన్న పవరే వేరు. మిగతా సంబంధాల్లా ఇద్దరి మధ్య విడిపోవడం అనేది ఉండదు. అలాగే జాక్వెలీన్‌పై కేవలం నాకు మాత్రమే హక్కు ఉంది'' అంటూ కామెంట్ చేశాడు రణ్‌బీర్. కపూర్స్ వారి అబ్బాయి సినిమాటిక్ గా చెప్పిన ఈ డైలాగ్‌ ప్రస్తుతం బీటౌన్ టాక్ గా మారింది. జాక్వెలీన్ పై ఏకంగా తనకే హక్కు ఉందడనడంతో వ్యవహారం కాస్త ముందడుగే పడిందని అంతా అనుకుంటున్నారు. రణ్‌బీర్‌, జాక్వెలీన్‌లు డేటింగ్‌లో ఉన్నారా? అనే విషయమై బాలీవుడ్ లో చర్చ కూడా ప్రారంభమైపోయింది. అయితే ఇక్కడో విశయం ఉంది. ఏ దిల్ హై ముష్కిల్ టీజర్ లో ఉన్న డైలాగ్ ని ఉటంకిస్తూ ఇన్ డైరెంట్ గా నే ఆ విషయాన్ని కామెడీ గా దాటేసాడు రణ్ బీర్

ఇదిలా ఉంటే, రణ్‌బీర్ విదేశీ అమ్మాయిలపైనే మనసుపడడం మరో ఇంట్రెస్టింగ్ ఇష్యూగా మారింది. రణ్‌బీర్ లైమ్ లైట్ లోకి వచ్చిన తర్వాత అతడి గాళ్ ఫ్రెండ్స్ గా సోనమ్ కపూర్, దీపిక పదుకోన్, నర్గీస్ ఫక్రి, కత్రినా కైఫ్.. ప్రస్తుతం జాక్వెలీన్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వీరిలో నర్గీస్, కత్రినా, జాక్వెలీన్ లు విదేశీ భామలు. ఈ సంగతి పక్కన పెడితే రణ్‌బీర్-జాక్వెలీన్ ల స్నేహం నిలుస్తుందా? లేక ఈ బంధం కూడా చరిత్రలో కలిసిపోతుందా? వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X