రహస్యంగా ఎంగేజ్మెంట్ జరిగి పోయిందా?
ముంబై: బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్, యంగ్ హీరో రణబీర్ కపూర్ గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి కాకుండానే ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ కాపురం చేస్తున్నారని టాక్. ఇండియాలో మీడియా కారణంగా ఎక్కడా ఏకాంతంగా గడిపే పరిస్థితి లేక పోవడంతో తరచూ విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసి వస్తున్నారు.
పెళ్లికి ముందు కొంతకాలం పాటు కలిసి సహజీవనం చేయడం ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వీలవుతుందని, పెళ్లి చేసుకోవడానికి ఇష్టపూర్వకమైన వాతావరణం ఏర్పడుతుందని ఈ జంట భావిస్తున్నారు. వీరి వివాహానికి ఇటు రణబీర్ ఫ్యామిలీతో పాటు అటు కత్రినా ఫ్యామిలీ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.

తొలుత రణబీర్ తండ్రి రిషి కపూర్ కాస్త అభ్యంతరం తెలిపినా తర్వాత కొడుకు కోరికను కాదనలేక పోయారట. అన్నీ ఓకే అయితే 2015 లో కల్లా వీరి వివాహ మహోత్సవం జరుగొచ్చని అంటున్నారు. వీరి వివాహ వేడుక అట్టహాసంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టాక్.
కాగా.....వీరి ఎంగేజ్మెంట్ ఇటీవల లండన్ లో జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి ఇద్దరి ఫ్యామిలీస్ హాజరైనట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది. వీళ్ల జోరు చూస్తుంటే త్వరలోనే పెళ్లి భాజా మోగేట్లు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











