కత్రినా-రణబీర్ ఒకే ఇంట్లోకి, సహజీవనం
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ మధ్య గత కొంతకాలంగా ప్రేమాయణం సాగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇండియాలో మీడియా కారణంగా ఎక్కడా ఏకాంతంగా గడిపే పరిస్థితి లేక పోవడంతో తరచూ విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసి వస్తున్నారు.
తాజాగా ఈ ఇద్దరూ మరో కొత్త ఇంట్లోకి మారుతున్నారు. ఇద్దరూ కలిసి ముంబై కార్టర్ రోడ్‌లో ఓ కొత్త ఇల్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. రేపు(నవంబర్ 8) ఇద్దరూ ఆ ఇంట్లోకి మారుతున్నట్లు తెలుస్తోంది. తమ కొంత ఇంటిని ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్, ఆర్కిటెక్ట్ ఆశీష్ షాతో డిజైన్ చేయిస్తున్నారట. సకల సౌకర్యాలతో ఎంతో లగ్జరీగా ఈ ఇల్లు ఉందని, రెండు టెర్రస్‌లు, స్విమ్మింగ్ ఫూల్ తదితర సౌకర్యాలు ఉన్నట్లు తెలుస్తోంది.

కొంతకాలం పాటు కలిసి సహజీవనం చేయడం ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వీలవుతుందని, పెళ్లి చేసుకోవడానికి ఇష్టపూర్వకమైన వాతావరణం ఏర్పడుతుందని ఈ జంట భావిస్తున్నారు. వీరి వివాహానికి ఇటు రణబీర్ ఫ్యామిలీతో పాటు అటు కత్రినా ఫ్యామిలీ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. తొలుత రణబీర్ తండ్రి రిషి కపూర్ కాస్త అభ్యంతరం తెలిపినా తర్వాత కొడుకు కోరికను కాదనలేక పోయారట. అన్నీ ఓకే అయితే 2015 ఫిబ్రవరి కల్లా వీరి వివాహ మహోత్సవం జరుగొచ్చని అంటున్నారు. వీరి వివాహ వేడుక అట్టహాసంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టాక్.


Click it and Unblock the Notifications











