రెడ్ హాండెడ్‌గా దొరికిపోయిన కత్రినా-రణబీర్!
ముంబై: బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ మరోసారి వార్తల్లోకెక్కారు. వీరి మధ్య ఎఫైర్ ఉందని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని గతంలో చాలా పుకార్లు షికార్లు చేసాయి. తాజాగా వీరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలకు బలం చేకూరుస్తూ తాజాగా ఓ సంఘటన చోటు చేసుకుంది.
ఏప్రిల్ 29న రణబీర్, కత్రినా వారి వారి సినిమా షూటింగుల్లో భాగంగా ముంబైలోని ఫిల్మ్ సిటీకి వచ్చారు. షూటింగ్ మధ్యలో ఇద్దరూ కలిసారు. రణబీర్‌కు సంబంధించిన వానిటీ వ్యాన్లో గంటకుపైగా ఏకాంతం గడిపారు. ఇద్దరూ వ్యాన్లో ప్రేమ కలాపాలు సాగించారని, ఎంజాయ్ చేసారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
విషయం తెలుసుకున్న మీడియా వారు అక్కడి చేరుకోగా ఇద్దరు అక్కడి నుంచి తుర్రుమన్నారు. కత్రినా బ్లూజీన్స్, బ్లాక్ టాప్‌తో ఉండగా, రణబీర్ బ్లాక్ ప్యాంట్, బ్రౌన్ జాకెట్‌తో కనిపించాడు. మీడియా వారితో మాట్లాడటానికి ప్రయత్నించగా నిరాకరించారు. ఇద్దరి మధ్య ఎలాంటి 'సం'బంధం లేనప్పుడు, ఇలా మీడియా నుంచి తప్పించుకోవాల్సిన అవసరం ఏమిటో..?
ఇటీవల ఓసారి కత్రినా అవార్డుల కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా...రణబీర్ స్వయంగా వెళ్లి పికప్ చేసుకున్నాడట. అంతే కాదు లాస్ట్ వీక్ కత్రినా రణబీర్‌ను తన ఇంటికి ఆహ్వానించి అతనికి నచ్చిన వంటలు చేసి పెట్టిందట. ఆమె ఇంట్లోనే ఇద్దరూ చాలా సేపు కలిసి గడిపారని టాక్.
గతంలో జరిగిన మరిన్ని సంఘటనలు పరిశీలిస్తే..రణబీర్ అర్ధరాత్రి రహస్యంగా ఆమె ఇంటికి చేరుకోవడం అందరినీ ఆశ్యర్య పరించింది. అయితే వెంటనే మీడియా వారు అక్కడికి చేరుకోవడంతో ఖంగుతిన్న రణబీర్ అక్కడి నుంచి జంప్ అయ్యాడు. ఓసారి రణబీర్‌కపూర్ ఇంటికి కత్రినా రహస్యంగా వెళ్ళినట్లు వార్తలు వచ్చాయి. ఆమె అక్కడకు వెళ్ళి తరువాత రణబీర్ లేకపోవడంతో అక్కడనే వెయిట్ చేసిందని, మీడియాను తప్పుదోవ పట్టించేందుకు తన కారును వెనక్కు పంపించేసిందని వార్తలు వినిపించాయి. ఎట్టకేలకు అక్కడకు చేరుకున్న రణబీర్ కపూర్‌తో మిడ్‌నైట్ డిన్నర్ చేసిందని, డిన్నర్ అయిన తరువాత ఇంటికి వెళ్ళకుండా అక్కడనే రణబీర్‌కపూర్‌తో చాలాసేపు గడిపిందని పుకార్లు వినిపించాయి. ఇవన్నీ చూస్తుంటే...రణబీర్, కత్రినా మధ్య కుచ్ కుచ్ హోతాహై లాంటి యవ్వారమేదో జరుగుతుందని స్పష్టమవుతోందికదూ...!


Click it and Unblock the Notifications












