విదేశాల్లో మన హీరో-హీరోయిన్ సీక్రెట్ రొమాన్స్ (లీకెడ్ ఫోటోలు)

By Srikanya

ముంబై : మన దేశంలో సెలబ్రేటీలను గుర్తిస్తారు. ఇక్కడ పర్శనల్ జీవితానికి దారి ఉండదు. అందుకే బాలీవుడ్ లో క్రేజీ లవ్ గా పేరు పడ్డ రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ ఇద్దరూ ప్రస్తుతం ఎంజాయ్ మెంట్ మూడ్ ని సెలబ్రేట్ చేసుకోవాటనికి Ibiza దీవికి ప్రయాణం కట్టారు. అక్కడ ఎక్కడ చూసినా వీరిద్దరు రొమాన్సే అంటున్నారు.

ఆ మధ్య అర్జున్ కపూర్ పార్టీలో కత్రినా కైఫ్ ను పట్టించుకోకుండా ..రణబీర్ ..మిగతా వాళ్లతో టైమ్ స్పెండ్ చేసినందుకు ఇద్దరి మధ్యా గ్యాప్ వచ్చింది. దాన్ని క్లియర్ చేసుకోవటానికి ఇద్దరూ ఇలా ప్రేమయాత్ర పోగ్రాం పెట్టుకున్నారు. దాంతో వీరి ఎడబాటుకు పరిష్కారం వెతుక్కున్నారు.

కత్రినాకైఫ్ నిజానికి బ్యాంగ్ బ్యాంగ్ షూటింగ్ లో ఉండాలి. కానీ..హృతిక్ రోషన్ కి ఆపరేషన్ జరగటంతో షూటింగ్ వాయిదా పడింది. దాంతో కత్రినా ఈ హ్యాలిడేస్ ని తన బోయ్ ప్రెండ్ తో ఎంజాయ్ చేయటానికి నిర్ణయించుకుంది. అయితే ఇండియాలో కష్టమని ఇలా విదేశాల్లో పెట్టుకుని హ్యాపీగా ఉంది. అయితే అక్కడ మీడియా కనిపెట్టేసి... ఇలా ఫోటోల్లో క్లిక్ మనిపించేసింది.

కత్రినా,రణబీర్ ..లీకెడ్ ఫోటోలు...స్లైడ్ షోలో ..

ఇద్దరూ కలిసి...ఎగిరే పక్షుల్లా..

ఈ జంట ఇండియాలో స్వేచ్చగా విహరించటానికి కష్టమని ఇలా పోగ్రాం పెట్టుకున్నారు. అక్కడ ఒకరినొకరు హగ్ చేసుకుంటూ ఇలా కెమెరా కంటికి దొరికిపోయారు. Ibiza లో వీరిని పట్టించుకునేవారు లేకపోవటం ఈ జంటకు రెక్కలొచ్చినట్లైంది. దాంతో వీరిద్దరు ఆనందానికి అంతేలేదు.

కత్రినా కైఫ్

Ibiza లో కత్రినా కైఫ్ ని అక్కడి ఫోటో గ్రాఫర్ ఇలా కెమెరాలో బంధించారు. సామాన్య యువతిలా సెలబ్రేటి స్టేటస్ మర్చిపోయి..హ్యాపీగా ఇలా ఎంజాయ్ చేస్తూ కెమెరాకు దొరికిపోయింది. ఆమె అక్కడ వారికి ఓ టూరిస్ట్ మాత్రమే..అంతేగానీ సినీ స్టార్ కాకపోవటం తో స్వేచ్చగా విహరించింది.

డేవిడ్ గుట్టా కాన్సర్ట్ లో...

Ibiza లో ఈ జంట కలిసి డేవిడ్ గుట్టా కాన్సర్ట్ కు వెళ్లింది. అక్కడ ఎవరూ ఈ జంటను పట్టించుకోకపోవటంతో హ్యాపీగా కొత్తగా లవ్ లో పడ్డ జంటలా స్వేచ్చగా విహరించారు. వీరి జంట అక్కడ మీడియాకు ఎక్కేదాకా అక్కడ ప్రత్యేక దృష్టి ఎవరకీ లేకపోవటం ప్లస్ అయ్యింది.

తొలిప్రేమ...

కత్రినా,రణబీర్ ఇద్దరూ అజబ్ ప్రేమ్ కి గజబ్ కహాని షూటింగ్ లోనే తొలిసారిగా ప్రేమలో పడ్డారంటారు. లవ్ ఫస్ట్ సైట్ మాదిరిగా వీరిద్దరూ ఒకరికొకరు అతుక్కుపోయారు. ఈ జంట ప్రేమ కథ సినిమా ప్రమోషన్ కోసం అని మొదట అంతా అనుకున్నారు కానీ ..తర్వాత వీరిద్దరు చనువు చూసి నిజమే అని ఫిక్స్ అయ్యారు.

సినిమా ప్రమోషన్

తమ సినిమా ప్రమేషన్ సమయంలోనే వారిద్దరూ బాగా దగ్గరయ్యారంటారు. షూటింగ్ సమయంలో అంటి ముట్టనట్లు ఉన్నా..కత్రినా ..ఈ ప్రమోషన్ సమయంలో ఈ యంగ్ హీరోకి బాగా దగ్గరైంది. దానికి తోడు అతను ఎదుగుతున్న హీరో కావటంతో అతనితో జర్ని బెస్ట్ అనే దగ్గరైందని అప్పట్లో వినిపించింది.

లవ్ బర్డ్స్

రణబీర్ కపూర్ కూడా తిన్నమైన వాడు కాదు..కత్రినా కైఫ్ కు ముందు దీపికా పదుకోని తో డేటింగ్ చేసేవాడు. వీరి జంట పెళ్లి దాకా వెళ్తుందని చెప్పుకునే వారు. అయితే కొంతదూరం అయ్యాక వీరు బ్రేక్ అప్ తీసుకున్నారు. ఈ డేటింగ్ కు అంతరాయం ఏర్పడింది. ఈ లోగా ఆ గ్యాప్ లో కత్రినా వచ్చి సెటిలైంది.

రిలేషన్ గాఢంగా...


కత్రినా కైఫ్ కి గతంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో ఎఫైర్ ఉందనే వారు. అలాగే సల్మాన్ అండతోనే ఆమె ఎదిగిందనేది వాస్తవం. సల్మాన్ ..కత్రినాను బాగా ప్రమోట్ చేసారు. వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు సూపర్ హిట్ అవటంతో ఈ కాంబినేషన్ కి మంచి క్రేజ్ వచ్చింది.

సినిమా స్టిల్ ...

అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ..లోని ఈ స్టిల్ ఎంత పాపులర్ అయ్యిందంటే తర్వాత చాలా పత్రికలు దీన్ని కవర్ పేజీ గా ప్రకటించాయి. ఈ స్టిల్ లో వీరిద్దరు మధ్య ఉన్న ఎఫైర్ స్పష్టంగా కనిపిస్తోందని చెప్పుకునేవారు. అయితే ఎక్కడా వీరిద్దరూ ఖడించే ప్రయత్నం చేసేవారు కాదు..అలాగని ఒప్పుకునేవారూ కాదు.

అవును..వాళ్లిద్దరూ...

బాలీవుడ్ లో జరిగే ఈవెంట్స్ కు వీళ్లిద్దరూ చాలా కాలం కలిసి వెళ్లటమో ..లేక అక్కడికి వెళ్లాక ఇద్దరూ కలిసి మాయం అయిపోవటమో జరిగింది. దాంతో తప్పనిసిరాగా కొంత కాలం పాటు కత్రినా ఉంటే అక్కడ...ఖచ్చితంగా రణబీర్ ఉంటాడని చెప్పుకునేవారు. బాలీవుడ్ పార్టీ లో వీరు ఒక హాట్ టాపిక్ గా మారారు.

మీడియా ఈవెంట్ లో...

అజబ్ ప్రేమ్ కి కహానీ మీడియా ఈవెంట్ లో వీళ్లిద్దరూ రెచ్చిపోవటం అప్పట్లో మీడియాలో పెద్ద వార్త అయ్యింది. ప్రెస్ మీట్ లోనే వీరిద్దరనీ టార్గెట్ చేస్తూ చాలా మంది ప్రశ్నించారు. వీరి జంటను అప్పుడు హాట్ జంటగా వర్ణించారు. అప్పటి నుంచే మీడియా ఈ ఎఫైర్ ని సీరియస్ గా ఓ వార్తగా ప్రచారం చేస్తూ వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X