ఏంటి ఇట్టా ఉన్నాడు? (వెరైటీగా స్టార్ హీరో ఫస్ట్ లుక్)

By Bojja Kumar

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన అనురాగ్ కశ్యప్ రణబీర్ కపూర్ హీరోగా ‘బాంబే వెల్వెట్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ జానీ బాలరాజ్ పాత్రలో కనిపించనున్నాడు.

ఈ చిత్రంలో రణబీర్ కపూర్ స్ట్రీట్ ఫైటర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు చాకొలేట్ బాయ్ ఇమేజ్ కలిగి ఉన్న రణబీర్...ఈ సినిమాతో తన ఇమేజ్ మార్చుకోవాలని చూస్తున్నట్లు ఈ ఫస్ట్ లుక్ చూస్తే స్పష్టమవుతోంది. గన్ ఫైరింగ్ చేస్తూ డిఫరెంటు లుక్స్, డిపరెంట్ హెయిర్ స్టయిల్ లో యాక్షన్ హీరోగా కనిపించాడు.

 Ranbir Kapoor's Bombay Velvet First look

ఇందులో అనుష్క శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. దర్శకుడు కరణ్ జోహార్ ఈ చిత్రంలో పూర్తి స్థాయి పాత్రలో కనిపించబోతున్నారు. సినిమా మొత్తం జానీ అనే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. అతను రోసీ అనే అమ్మాయిన ప్రేమిస్తూ ఉంటాడు. రోసీ పాత్రలో అనుష్క శర్మ కనిపించబోతోంది. కథ, కథనం ఆసక్తికరంగా సాగనుంది.

ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్, పాంథమ్ ప్రొడక్షన్స్ పతాకంపై వికాస్ బాల్, విక్రమాదిత్య మొత్వాని నిర్మిస్తున్నారు. మే 15వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఉంటుందనే ప్రచారానికి ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరింత బలం ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X