దొంగ చాటుగా తప్పు చేస్తూ దొరికిన హీరో (ఫోటో)
హైదరాబాద్: బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ తప్పు చేస్తూ రెడ్ హాండెడ్ గా దొరికి పోయారు. రణబీర్‌కు కోపంతో పాటే స్మోకింగ్ అనే చెడ్డ అలవాటు కూడా ఉంది. దీన్ని మానేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అతని వల్ల కావడం లేదు. పలు సందర్భాల్లో ఈ విషయంలో జరిమానా కూడా కట్టాడు. ‘యే జవానీ హై దివానీ' షూటింగ్ సందర్భంగా రాజాస్థాన్ లో స్మోక్ చేసి నిబంధనలు అతిక్రమించాడు. ఇందుకు జరిమానా కూడా కట్టాడు.
తాజాగా రణబీర్ కపూర్ ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్ మ్యాచ్ సందర్భంగా....స్మోక్ చేస్తూ దొరికి పోయాడు. ఇండియన్ సూపర్ లీగ్ లోని ముంబై ఫుట్ బాల్ జట్టు యజమనుల్లో ఒకరైన రణబీర్ సింగ్ ఇటీవల ముంబై-గోవా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కు హాజరయ్యాడు. మధ్యలో ఇలా పైకెళ్లి దొంగచాటుగా దమ్ము కొట్టాడు. ఈ ఫోటోతో రణబీర్ కపూర్ చుట్టు వివాదం ముసుకురింది.

రణబీర్ గురించిన ఇతర వివరాల్లోకి వెళితే....
రణబీర్, కత్రినా గత కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం నుండి ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. ఇద్దరూ 2015లో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత వ్యవహారం నడుస్తున్నా, విషయం మీడియా ద్వారా అందరికీ తెలిసినా ఇద్దరూ తమ మధ్య ఉన్న బంధాన్ని మాత్రం అఫీషియల్‌గా బయట పెట్టడం లేదు.
ఇద్దరూ కలిసి ఉండటానికి ముంబై కార్టర్ రోడ్‌లో ఓ కొత్త ఇల్లు కొనుగోలు చేసినట్లు గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇద్దరూ కలిసి ఆ ఇంట్లో వెలుతున్న ఫోటో ఒకటి ముంబైకి చెందిన ప్రముఖ దిన పత్రిక బయట పెట్టింది. ఇపుడు ఈ ఫోటో ఇంటర్నెట్లో వైరల్‌లా వ్యాపించింది. ఈ ఇంటిని ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్, ఆర్కిటెక్ట్ ఆశీష్ షాతో డిజైన్ చేసినట్లు సమాచారం. సకల సౌకర్యాలతో ఎంతో లగ్జరీగా ఈ ఇల్లు ఉందని, రెండు టెర్రస్‌లు, స్విమ్మింగ్ ఫూల్ తదితర సౌకర్యాలు ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











