Animal Movie : యానిమల్ సినిమాకు సీక్వెల్... ట్విస్ట్ ఇచ్చిన మేకర్స్... పేరేంటో తెలుసా?

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, అర్జున్‌ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం యానిమల్. ఇక ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌ గా నటించింది. ఇక ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి వైయిలెంట్ టాక్ తెచ్చుకుంటుంది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో సీక్వెల్ ప్రకటించి మేకర్స్ షాక్ ఇచ్చారు. సినిమా కథేంటి.. సీక్వెల్ పేరెంటి అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ను షేక్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఇక ఇదే సినిమా హిందీకి తీసుకువెళ్లి కబీర్ సింగ్ పేరుతో షాహిద్ కపూర్ ను వైల్డ్ గా చూపించాడు. ఇక ఈ సినిమా కూడా అక్కడ సూపర్ హిట్టుగా నిలిచింది. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా తెరకెక్కించిన చిత్రం యానిమల్. సినిమా పేరే వైల్డ్ గా అనిపించినా... సినిమా కూడా అంతే వైల్డ్ గా తెరకెక్కించాడు.

 Ranbir Kapoor Sandeep Vanga Animal Movie Sequel Name Animal Park Full Details Here

దర్శకుడు సందీప్ రెడ్డి తనదైన మార్క్ మరోసారి చూపించాడు. ఇక ఈ సినిమాలో బాబీడియోల్ విలన్ పాత్రలో నటించగా... అనిల్ కపూర్ కీలకపాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాను భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ బ్యాన‌ర్‌ పై భూషణ్‌కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమాకు దాదాపు వంద కోట్ల రూపాయలు మొదటి రోజు రానున్నాయని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.15కోట్ల రూపాయలగా నమోదు చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 250 కోట్లు చేసుకుంది. అంటే రూ. 252 కోట్లు నెట్ వస్తేనే ఈ సినిమా హిట్ అవుతుంది. ఇక మొదటి రోజు 100 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుందని అని తెలుస్తోంది. తెలుగులో రూ.10కోట్లు వసూలు చేయబోతుందని అంటున్నారు.

 Ranbir Kapoor Sandeep Vanga Animal Movie Sequel Name Animal Park Full Details Here

ఇక ఈ సినిమాలో వైల్డ్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటున్నాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రణబీర్ యాక్షన్స్ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయని తెలుస్తోంది. ఈ సినిమా మూడున్నర గంటలు ఉండటం ప్రేక్షకులకు పరీక్షగా నిలిచింది. కాస్త సాగదీతగా అనిపించందని అంటున్నారు. ఇక ఎట్టకేలకు ఈ సినిమాకు మొదటి నుంచి ఊహించినట్లు సీక్వెల్ ప్రకటించారు మేకర్స్.

ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించి షాక్ ఇచ్చారు. యానిమల్ సీక్వెల్ పేరు యానిమల్ పార్క్ అని పెట్టారు. దీంతో సీక్వెల్ పైన కూడా మరింత హైప్స్ నెలకొన్నాయి. యానిమల్ సినిమాలో విలన్ రోల్ పోషించిన బాబీ డియోల్ చనిపోయినప్పటికీ... మరో విలన్ క్యారెక్టర్ రణబీర్ కపూర్ పోషించడం ట్విస్ట్ కలిగిస్తుంది. మరి యానిమల్ పార్క్ లో ఇద్దరు యానిమల్స్ పోరాడితే ఎలా ఉంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X