SS Rajamouli: రాజమౌళికి షాక్ ఇచ్చిన రణబీర్ కపూర్.. ఇది కదా అసలైన విశ్వాసం
సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీరీ కపూర్ హీరోగా తెరకెక్కిన చిత్రం యానిమల్. ఇక ఈ మూవీ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంటుకు రాజమౌళి, మహేశ్ బాబు గెస్టులుగా వచ్చారు. ఇక ఈ ఈవెంట్లో రాజమౌళి మాట్లాడుతూ.. రణబీర్ కపూర్ కు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వేశారు. దానికి ఆయన షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. అసలు ఆ క్వశ్చన్ ఏంటి.. రణబీర్ కపూర్ ఏం సమాధానం చెప్పారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం యనిమాల్. ఈ సినిమా డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హీందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ట్రైలర్, పాటలు బాగా ఆకట్టుకున్నాయి. ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న ఈ చిత్రం.. రాజమౌళి, మహేశ్ గెస్టులుగా వచ్చారు. ఇక రాజమౌళి ఈ ప్రిరిలీజ్ ఈవెంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఎస్ఎస్ రాజమౌళి యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంటుకు హాజరు అయ్యారు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంటుకు సుమ యాంకరింగ్ చేసింది. అయితే రాజమౌళిని సుమ ఓ క్వశ్చను అడుగుతుంది. ఈ స్జేజ్ మీద ఒకరిని క్వశ్చన్ అడిగాలి అనుకుంటే.. ఎవరిని అడుగుతారు అని అడిగింది. దీంతో రాజమౌళి.. రణబీర్ కపూర్ ను అడుగుతాను అని చెప్తాడు. దీంతో ఆయన్ని పిలిచి.. ఓ క్వశ్చన్ అడిగాడు. దీనికి రణబీర్ కపూర్ దిమ్మతిరిగే షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు.
నువ్వు సందీప్ రెడ్డి వంగాను ఇష్టపడుతావు కదా అని రాజమౌళి అడుగుతాడు. దానికి రణబీర్ కపూర్.. ఐ లవ్ సందీప్ రెడ్డి వంగా అని చెప్తాడు. ఇక రాజమౌళి మాట్లాడుతూ... సందీప్ రెడ్డి వంగా వరల్డ్ నెంబర్ వన్ దర్శకుల్లో ఒకరని అనుకుంటున్నావా అంటే.. అవును అని రణబీర్ చెప్తాడు. ఇక రాజమౌళి నీకు సినిమా ఛాన్స్ వస్తే.. నాతో చేస్తావా.. సందీప్ రెడ్డి వంగాతో చేస్తావా అంటూ ఓ క్వశ్చన్ రణబీర్ ను అడిగాడు. దీంతో రణబీర్ కపూర్ కాస్త ఆలోచనలో పడి.. షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు.
రణబీర్ కపూర్ మాట్లాడుతూ... డబుల్ షిప్ట్స్ చేస్తాను.. అక్కడ ఇక్కడ రెండు సినిమాలు చేస్తాను అని ఆన్సర్ చేస్తాడు. అయితే ఇలా కాదు.. ఒకే ఆన్సర్ చెప్పాలి అని చెప్తాడు రాజమౌళి. దీంతో సందీప్ వంగా రెడ్డి దర్శకత్వంలోనే సినిమా చేస్తాను అని రణబీర్ కపూర్ చెప్తాడు. ఇక ఈ సమాధానంతో అందరిలో నవ్వులు పూశాయి. ఇక లాయలిటీ ప్రకారం సందీప్ రెడ్డి అని రణబీర్ క్లారిటీ ఇచ్చాడు. ఇక రాజమౌళి కూడా ఫెన్టాస్టిక్ అంటూ చెప్పుకువచ్చాడు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక రాజమౌళి మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ సినిమాలకు ఓ సెన్సేషన్.. ఇప్పుడు మళ్లీ సందీప్ వంగా అలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. యానిమల్ టీజర్ చూసినప్పుడే ఈ సినిమా చూాడాల్సిందే అనుకున్నాను అని చెప్పుకువచ్చాడు. బాలీవుడ్‌లో నాకిష్టమైన హీరో రణ్‌బీర్ కపూర్. ఆయన 15ఏళ్ల కెరీర్‌లో తన ప్రతిభను చూపించుకునే సినిమాలు చాలా తక్కువ పడ్డాయి. వాటిలో 'యానిమల్' టాప్‌లో ఉంటుందని చెప్పుకువచ్చాడు.


Click it and Unblock the Notifications











