twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏంటది, ముద్దూ లేకా పెదాలను కొరుక్కుతింటున్నాడా..?

    By Nageswara Rao
    |

    బాలీవుడ్ చాక్ లెట్ బాయ్ రణభీర్ కపూర్ ప్రస్తుతం ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రాక్ స్టార్ అనే సినిమాని చేస్తున్నారు. ఈ సినిమాని ఇంతియాజ్ ఆలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సాధారణంగా బాలీవుడ్లో ముద్దుగా ముద్దుల వీరుడుగా ఇమ్రాన్ హాస్మిని పిలుస్తుంటారు. కానీ రణభీర్ కపూర్ నటించిన రాక్ స్టార్ సినిమా విడుదలైన తర్వాత ఈ 'సిరియల్ కిస్సర్' అనే బిరుదు రణభీర్ కపూర్ తన్నుకుబోతాడని అనుకుంటున్నారు.

    మొన్నకి మొన్న అంజానా అంజానీ సినిమాలో ప్రియాంక చొప్రాతో, నిన్న రాజనీతి సినిమాలో కత్రినా కైప్‌తో లిప్ లాక్ చేసిన రణభీర్ కపూర్ తాజాగా రాక్ స్టార్ హీరోయిన్ నర్గిస్ ఫక్రీతో నరాలు జివ్వుమనేలా ముద్దు పెట్టాడని ప్రక్కనున్న ఈ ఫోటోని చూస్తుంటే తెలిసిపోతుంది. రణభీర్ కపూర్, నర్గీస్ ఫక్రీకి పెట్టిన ముద్దు క్యాజువల్‌గా లేదని, ఇద్దరు కూడా తన్మయత్వంలో మునిగి పోతూ రెచ్చిపోయి మరీ యూనిట్‌లో జనాభా ఉన్న విషయం కూడా మరచిపోయి మరీ మద్దులతో తేలిపోయారని సమాచారం.

    అంతక ముందు రణభీర్ కపూర్, నర్గిస్ ఫక్రీ ఇద్దరూ కూడా కలసి డేటింగ్ చేస్తున్నారంటూ రూమర్స్ రావడం జరిగింది. అది తెలిసిన యూనిట్ సభ్యులు గతంలో డేటింగ్ చేసిన అనుభవం ఉంది కాబట్టి ఇలాంటి ముద్దు పెట్టుకోవడం పెద్ద వింత ఏమి కాదులే అని నిట్టూర్చారు. ఇది మాత్రమే కాకుండా ఇలాంటి మద్దులు రాక్ స్టార్‌లో చాలానే ఉన్నాయని సమాచారం. ఇది ఇలా ఉంటే 'రాక్‌స్టార్" షూటింగ్‌ని అక్కడ ప్లాన్ చేశారు. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో వేశ్యల కోసం రణబీర్ పాట పాడే సందర్భం ఒకటుంది. కావున భారీ ఎత్తున సెక్స్ వర్కర్లు ఈ పాటలో ప్రేక్షకులుగా నటించాల్సి ఉండటంతో, ముందుగా జూనియర్ ఆర్టిస్టులతో తీద్దామనుకున్నారట ఇంతియాజ్.

    అయితే నిజమైన సెక్స్ వర్కర్లతో ఈ సీన్ తీస్తే పండుతుందని భావించిన ఆయన రెడ్ లైట్ ఏరియాకి వెళ్లి, అక్కడివారితో సంప్రతింపులు జరిపారట. ఆ వేశ్యావాటికలో ఉన్నవారికి రణబీర్‌ని చూడబోతున్నామన్న ఆనందం ఒకవైపు ఉన్నప్పటికీ మరోవైపు సినిమాలో నటిస్తే, బహిరంగంగా తాము అందరికీ కనిపిస్తామనే సంశయం వారిలో ఉండటంతో.. ఇంతియాజ్ ప్రతిపాదనను అంగీకరించడానికి వెనుకడుగు వేశారట.

    ఈ నేపథ్యంలోనే రణబీర్ ఆ రెడ్‌లైట్ ఏరియాకి వెళ్లి, అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడి, వారిలో ఉన్న బిడియాన్ని, బెరుకుతనాన్ని పోగొట్టారట. దాంతో సినిమాలో నటించడానికి వారందరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సెక్స్ వర్కర్లు తనని చుట్టుముట్టగా, గిటార్ వాయిస్తూ.. రణబీర్ పాట పాడే విధంగా ఇంతియాజ్ అలీ చిత్రీకరించారు.

    ఈ షూటింగ్ పూర్తయిన తర్వాత కొంతమంది అమ్మాయిలు రణబీర్‌తో ఫొటో దిగడంతో పాటు, ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నారు. అనంతరం ఈ చిత్రం విజయం సాధించాలని శుభాకాంక్షలు కూడా అందజేశారు. అలాగే 'రాక్‌స్టార్" యూనిట్ సభ్యులకు టీ, రొట్టె కూడా ఇచ్చి తమ ఆతిథ్యం స్వీకరించమని కోరారు. ఆ విన్నపాన్ని మన్నించి.. రొట్టె ఆరగించి, టీ తాగి ఈ యూనిట్ సభ్యులు వారిని ఆనందపరిచారు. సమాజంలో తమను చీడ పురుగులను చూసినట్లు చూస్తున్న నేపథ్యంలో ఈ విధమైన ఆదరణను ఊహించని సదరు మహిళలు చెమ్మగిల్లిన కళ్లతో 'రాక్‌స్టార్" బృందానికి వీడ్కోలు పలికారట.

    English summary
    Ranbir Kapoor seems to be in a hurry to snatch the tag of 'serial kisser' from Emraan Hashmi! After kissing Priyanka Chopra in Anjaana Anjaani and Katrina Kaif in Raajneeti, Ranbir has now reportedly locked lips with his Rockstar actress Nargis Fakhri.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X