సిగెరెట్ కాల్చినందుకు హీరోకు సమన్లు
మొన్నామధ్య షారూఖ్ ఖాన్ సిగెరట్ ని బహిరంగంగా కాలుస్తూ పట్టుబడిన సంగతి ఇంకా మరవక ముందే మరో బాలీవుడ్ హీరో బుక్కయ్యాడు. బాలీవుడ్ చాక్లెట్ బోయ్ రణబీర్ కపూర్ ని ఈ సారి రాజస్ధాన్ లో ఈ సారి పొగ త్రాగినందుకు కేసు వేయించుకున్నాడు. రాజస్ధాన్ కి చెందిన హరీష్ అనే వ్యక్తి ఈ యంగ్ హీరోపై కేసు వేసారు. ప్రస్తుతం ఈ కేసు విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
'ఏ జవానీ హై దీవానీ' సినిమా షూటింగ్ కోసం రణబీర్ కపూర్ రాజస్థాన్ వచ్చారు. సినిమా సెట్స్‌లో బహిరంగంగా సిగార్ కాల్చారు. దాంతో అలా బహిరంగంగా కాల్చినందుకుగాను కోర్టు నుంచి సమన్లు అందుకున్నాడు. 'రాజస్థాన్ ప్రివెన్షన్ ఆఫ్ స్మోకింగ్ యాక్ట్' కింద ఉదయ్‌పూర్ పట్టణవాసి హరీష్ వైష్ణవ్ చేసిన ఫిర్యాదు మేరకు జూన్ 26న విచారణకు రావాలంటూ ఉదయ్‌పూర్ న్యాయస్థానం సమన్లు పంపింది.
సెట్స్‌లో రణ్‌బీర్ సిగరెట్ తాగుతున్న దృశ్యాలు స్థానిక పత్రికల్లో ప్రచురితం కాగా, వీటి ఆధారంగా హరీష్ స్పందించి న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు. 'రాజస్థాన్ ప్రివెన్షన్ ఆఫ్ స్మోకింగ్ యాక్ట్' కింద గరిష్ఠంగా 6 నెలల జైలు శిక్ష లేదా రూ.200 జరిమానా విధిస్తారు. రణ్‌బీర్, దీపికా పదుకొనె జంటగా నటిస్తున్న 'ఏ జవానీ హై దీవానీ' సినిమాకు 'వేక్ అప్ సిద్' దర్శకుడు అయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











