వారిద్దరు పబ్లిగ్గా పట్టుబడ్డారు, కెమెరాలకు చిక్కారు
ముంబై: తమ మధ్య ఉన్న సంబంధాన్ని బాలీవుడ్ హాట్ కపుల్ రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ ఇక మాత్రం గోప్యంగా ఉంచదలుచుకోలేదని అర్థమవుతోంది. తమ మధ్య గల సంబంధంపై ఊహాగానాలకు తెర దింపే పనికి పూనుకున్నట్లున్నారు.
ఐబిఎన్ కథనం ప్రకారం - ది వోల్ఫ్ ఆఫ్ ద వాల్ స్ట్రీట్ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు కత్రినా, రణబీర్ కలిసి వెళ్లారు. ఆ సినిమా చూస్తూ అందరి కంటా పడ్డారు. ముంబైలో ఇది జరిగిది. కలిసి కెమెరా కన్నుకు చిక్కడానికి ఇష్టపడని ఆ జంట ఈసారి మాత్రం దర్జాగా ఫోజులు ఇచ్చేశారు.

ఇద్దరు కలిసి కెమెరాకు ఇదే మొదటిసారి. ఒకే ఫ్రేమ్‌లోకి ఆ జంట కలిసి రావడం ఇదే తొలిసారి అన్న మాట. దాంతో తమ మధ్య ఉన్న సంబంధాన్ని వారు అందరికీ తెలియజేసే ఉద్దేశంతోనే కలిసి కెమెరాకు చిక్కారా అనేది చర్చనీయాంశంగా మారింది.
రణబీర్ కజిన్ సిస్టర్ కరీనా కపూర్ ఓ టాక్ షోలో వారిద్దరి సంబంధం గురించి కాస్తా మసాలా దట్టించి, చెప్పి చెప్పకుండా చెప్పేశారు. ఇదంతా చూస్తుంటే రణబీర్, కత్రినా కైఫ్ పెళ్లి చేసుకోబోతున్నారా అనే సందేహం పుట్టుకొస్తోంది.


Click it and Unblock the Notifications











