కత్రినాతో రణబీర్: ఒంటరిగా దీపికా (పిక్చర్స్)
ముంబై: ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ జన్మదిన వేడుకలకు సినీ తారలు క్యూ కట్టారు. పరిశ్రమకు చెందిన కొంత మంది ప్రముఖులు కరణ్ జన్మదిన వేడుకల్లో సందడి చేశారు. అది రణబీర్ కపూర్, దీపికా పడుకొనే, కత్రినా కైఫ్ ముక్కోణపు ప్రేమ కూడా ఈ సందర్భంగా చర్చనీయాంశంగా మారింది. కరణ్ జోహర్ శనివారం రాత్రి తన 41వ జన్మదిన వేడుకలను జరుపుకున్నాడు.
రణబీర్ కపూర్ తన గర్ల్ ఫ్రెండ్ కత్రినా కైఫ్‌తో కలిసి ఈ వేడుకలకు వచ్చినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒకే కారులో వారిద్దరు వచ్చినట్లు చెబుతున్నారు. వారిద్దరు చేతిలో చేయి వేసుకుని సందడి చేయడమే కాకుండా ఇరువురు కలిసి డ్యాన్స్ కూడా చేశారట.
ఈ జన్మదిన వేడుకలకు వచ్చిన రణబీర్ కపూర్ మాజీ ప్రియురాలు దీపికా పడుకొనే మాత్రం ఒంటరిగా కనిపించినట్లు చెబుతున్నారు. కత్రినా ప్రవేశించిన తర్వాతనే రణబీర్ కపూర్ దీపికతో తెగదెంపులు చేసుకున్నట్లు చెబుతారు.
ఈసారి కరణ్ జోహర్ జన్మదిన వేడుకల్లో షారూక్ ఖాన్‌కు బదులు అమీర్ ఖాన్ కనిపించాడు. చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా పనిలో బిజీగా ఉన్నందున షారూక్ రాలేదని చెబుతున్నారు. అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం, ఆదిత్య రాయ్ కపూర్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా, హుమా ఖురేష్, అర్జున్ రాంపాల్ వచ్చారు. రవీనా టాండన్ తన భర్త అనిల్‌తో కలిసి వచ్చింది. కాజోల్, రన్వీర్ సింగ్, కరిష్మా కపూర్, ఇమ్రాన్ ఖాన్ తదితరులు ఈ వేడుకలకు వచ్చారు.

కరణ్ జోహర్ జన్మదిన వేడుకలకు అమీర్ ఖాన్ షార్ట్స్, టీ - షర్టులో దిగిపోయాడు.

దీపికా పడుకొనే ఒంటరిగా జన్మదిన వేడుకలకు వచ్చింది.

గర్ల్ ఫ్రెండ్ కత్రినా కైఫ్‌తో కలిసి రణబీర్ కపూర్ వచ్చినట్లు సమాచారం.

పార్టీలో కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ కలిసి డ్యాన్స్ చేసినట్లు చెబుతున్నారు.

భార్య ట్వింకిల్ ఖన్నాను వదిలేసి అక్షయ్ కుమార్ ఒంటరిగా వచ్చాడు.

కరణ్ జోహర్ జన్మ దిన వేడుకలకు రాత్రి పొద్దు పోయే వరకు జరిగాయి. జాన్ అబ్రహం ఇలా..

పార్టీ ముగిసిన తర్వాత వరుణ్ ధావన్‌తో ముచ్చటిస్తూ కరణ్ జోహర్

పింక్ షర్టులో పార్టీకి వచ్చిన సిద్ధార్థ్ మల్హోత్రా

పార్టీలో ఆదిత్య రాయ్ కపూర్.. ఆయన ఆశిఖి చిత్రం మంచి బిజినెస్ చేసింది.

భర్త షారూక్ ఖాన్ లేకుండా పార్టీకి వచ్చిన గౌరీ ఖాన్. చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా పనిలో షారూక్ బిజీగా ఉన్నాడు.

భర్త రితిక్ రోషన్ లేకుండా నల్లటి దుస్తుల్లో పార్టీకి వచ్చిన సుసేన్ ఖాన్

తెల్ల టీ - షర్ట్, బ్లూ జీన్స్‌లో పార్టీకి వచ్చిన రణవీర్ సింగ్

ప్రస్తుతం గోరీ తేరే ప్యార్ మే చిత్రంలో నటిస్తున్న ఇమ్రాన్ ఖాన్ కూడా పార్టీకి విచ్చేశాడు.

సోదరి కరీనా కపూర్ మిస్ కాగా, కరిష్మ కపూర్ మాత్రం పార్టీకి వచ్చేసింది.

కరణ్ జోహర్‌కు మంచి స్నేహితురాలు భర్త అజయ్ దేవగన్ లేకుండా పార్టీకి వచ్చింది.

తెల్లటి టీ షర్ట్ దరించి పార్టీకి వస్తూ అర్జున్ రాంపాల్..

కరణ్ జోహర్ పార్టీలో మీడియాను, కెమెరాలను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ సోనం కపూర్

కరణ్ జోహర్ బర్త్ డే పార్టీలో హుమా ఖురేషి. వరుణ్ ధావన్, అమీర్ ఖాన్ పార్టీ నుంచి అందరి కన్నా వెనక వెళ్లిపోయారు.


Click it and Unblock the Notifications











