మణిరత్నం ఆఫర్ రిజెక్టు చేసిన హీరో

By Srikanya

సాధారణంగా మణిరత్నం దర్శకత్వంలో ఆఫర్ రావటం అనగానే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. అయితే ఇందుకు భిన్నంగా హిందీ కుర్ర హీరో రణబీర్ ప్రవర్తించాడు. దర్శకుడు ఎవరు అనే దాని కన్నా ముందుగా కథ విని తర్వాత డిసైడ్ చేస్తానన్నాడు. ఓకే అని ఓ కథ చెపితే నాకు నచ్చలేదు..నేను చెయ్యను పొమ్మన్నాడు. దాంతో అంతా రణబీర్ తెగువకు విస్తుపోతున్నారు. మరో ప్రక్క టాప్ డైరక్టర్ డేవిడ్ ధావన్ కూడా ఈ టాపిక్ పై స్పందిస్తూ నేను 'ఛస్మే బధ్దూర్‌' రీమేక్‌ చేద్దామని ప్రపోజల్ పెట్టాను..అదీ రిజక్టు చేసాడు అని అంటున్నాడు. ఇంతకీ మణిరత్నం చెప్పిన స్క్రిప్టు ఏమిటీ అంటే దాని పేరు 'అజాన్‌'. ముస్లిమ్‌ నేపథ్యమున్న కథ ఇది. అయితే తాను ఇంత చిన్న వయస్సులో అంత బరువున్న సబ్జెక్టులు చేయటం కష్టమని మీడియాతో చెప్పారట. మణిరత్నం దృష్టి హిందిపైనా ఉండటంతో ఆయన తమిళంలో ఓ హీరోను (కార్తీక్ కొడుకు)ని అనుకుని హిందీకి రణబీర్ ని అడిగి లేదనిపించుకున్నాడు. ఇక పర్మనెంట్ హీరో అభిషేక్ ని అడుగుదాము అంటే ఆ కథకు హీరో చాలా చిన్న వయస్సు వాడవ్వాలని తెలుస్తోంది. ప్రస్తుతం మణిరత్నం.. ఐశ్వర్యారాయ్ కాంబినేషన్ లో విక్రమ్, అభిషేక్ బచ్చన్ లతో రావణ్ అనే సినిమా రూపొందిస్తున్నారు. హిందీ, తమిళ బాషల్లో రూపొందే ఈ చిత్రం తెలుగులోనూ డబ్బింగ్ అవుతుంది. ఈ చిత్రంలో ప్రియమణి కూడా కీలకమైన పాత్ర చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X