నితిన్ అభిమానుల కోసం 'రంగ్ దే' సర్‌ప్రైజ్.. పెళ్లి కానుకగా..
టాలీవుడ్ యువ హీరో నితిన్ మొత్తానికి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నేడు తన ప్రేయసి షాలిని మెడలో మూడు ముళ్ళు వేయబోతున్న విషయం తెలిసిందే. గత ఐదు రోజుల నుంచి పెళ్లికి సంబంధించిన అనేక రకాల వేడుకలతో నితిన్ మ్యారేజ్ ఫెస్టివల్ ని గట్టిగానే ఎంజాయ్ చేస్తున్నాడు.
తన మెహంది వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించిన విషయం తెలిసిందే. పవన్ తో పాటు త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ కలిసి వచ్చారు. పవన్ కళ్యాణ్ చాలా కూల్ గా వచ్చిన విధానం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఈ రోజు పెళ్లి కాబట్టి నితిన్ కి సెలబ్రెటీస్ నుంచి భారీ స్థాయిలో విషెస్ అందనున్నాయి.

ఇక నితిన్ అభిమానుల కోసం రంగ్ దే చిత్ర యూనిట్ ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా చిత్ర యూనిట్ అభిమానులకు మంచి కిక్ ఇవ్వనున్నట్లు టాక్ అయితే వస్తోంది. ఇక ఆ సర్‌ప్రైజ్ ఏమిటనేది తెలియాలి అంటే నేడు సాయత్రం నాలుగు గంటల వరకు వెయిట్ చేయాల్సిందే.
సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ లాంటిది ఏమైనా రిలీజ్ చేస్తారా అనే సందేహాలు వస్తున్నాయి. మరి ఆ స్పెషల్ సర్‌ప్రైజ్ ఏమై ఉంటుందో క్లారిటీ రావాలి అంటే మరికొన్ని కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది


Click it and Unblock the Notifications











