కీర్తి సురేష్ చేసిన పనికి నోరేళ్ళబెట్టిన నితిన్, దేవిశ్రీప్రసాద్.. కడుపు మీద కొట్టడంతో నెత్తి బాదుకుంటూ..
నితిన్, కీర్తి సురేష్ మొదటిసారి కలిసి నటించిన చిత్రం రంగ్ దే. ఈ సినిమా కోసం ఓ వర్గం ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సినిమా టీజర్ ట్రైలర్ కు అలాగే సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రమోషన్ డోస్ పెంచిన చిత్ర యూనిట్ అప్పుడప్పుడు డిఫరెంట్ వీడియోలతో మంచి ఫన్ క్రియేట్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా కీర్తి సురేష్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అమీరా దస్తర్ లేటేస్ట్ ఫోటో గ్యాలరీ... మరింత బ్యూటీ డోస్‌తో

టీజర్, ట్రైలర్ క్లిక్కవ్వడంతో..
రంగ్ దే సినిమాపై ప్రస్తుతం మంచి బజ్ అయితే క్రియేట్ అవుతోంది. ముఖ్యంగా టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. కామెడీ ప్లస్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా ప్రమోషన్ విషయంలో చిత్ర యూనిట్ ఏ మాత్రం గ్యాప్ తీసుకోవడం లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్రోమోలు అంటూ సినిమాను జనాల్లోకి తీసుకువెళుతున్నారు.

అల్లరి వేశాలు వేస్తూ..
దాదాపు చిత్ర యూనిట్ మొత్తం ప్రమోషన్ లో బిజీ అయిపోయింది. ఇక అప్పుడప్పుడు ఫన్నీ వీడియోస్ రిలీజ్ చేస్తూ ఆడియెన్స్ ను అమితంగా నవ్విస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ లోని అల్లరి వేశాలను కూడా ఆడియెన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. నితిన్, కీర్తి సురేష్ ముక్కు పై పంచ్ ఇచ్చిన వీడియో బాగానే వైరల్ అయ్యింది.
ముదురు వయసులో వన్నె తరగని కరీనా కపూర్.. ట్రోలింగ్ గురైన లేటెస్ట్ పిక్స్ ఇవే
అందరి ఫుడ్ ను లాగించేసిన మహానటి
ఇక మళ్ళీ ఇప్పుడు రంగ్ దే టీమ్ మరొక వీడియోతో ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. ఇటీవల ఒక ఈవెంట్ ముగిసిన అనంతరం తినడానికి రెడీగా ఉన్న హీరోకు, దర్శకుడికి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కు మహానటి షాక్ ఇచ్చింది. వాళ్ళు ఎంతో ఆకలిగా ఉంటే.. హ్యాపీగా అందరి ఫుడ్ ను ఒక్కతే లాగించేసినట్లు స్టిల్ ఇచ్చింది.
Recommended Video

నోరేళ్ళబెట్టిన నితిన్
ఇక కీర్తి సురేష్ ను చూసిన నితిన్, దేవిశ్రీప్రసాద్ షాక్ అవుతూ నోరేళ్ళబెట్టారు. మన బ్రతుకు బస్ స్టాండే బస్ స్టాండే అనే పాటతో నెత్తి బాదుకున్నారు. దేవిశ్రీప్రసాద్ ప్రసాద్ సోషల్ మీడియాలో షేర్ చేసిన నిమిషాల్లోనే ఆ వీడియో వైరల్ గా మారిపోయింది. ఏదేమైనా చిత్ర యూనిట్ పాజిటివ్ కామెడీతో సినిమా కోసం గట్టిగానే ప్రమోషన్ చేస్తున్నారు. మరి సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











