సెన్సార్ చేయని హాట్ వీడియో లీకైంది
ముంబై: కేతన్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ‘రంగ్ రసియా' చిత్రం ఇపుడు హాట్ టాపిక్ అయింది. ఈ చిత్రం 19వ శతాబ్దానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ జీవిత చరిత్రను ఫోకస్ చేసే సినిమా కావడం, ఇందులో నందనా సేన్ నగ్నంగా నటించడం, నందనా సేన్-రణదీప్ హుడా మధ్య జరిగి జరిగే రొమాంటిక్ సీన్లు హాట్ హాట్‌గా ఉండటమే ఇందుకు కారణం.
సందెట్లో సడేమియాలా...ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ చేయని వీడియో ఒకటి యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా ఫేమస్ పేయింటర్, దేవదాసి సుగంధ మధ్య సంబంధం గురించి సాగుతుంది. ఇప్పటికే ఈ చిత్రం అనేక వివాదాలు ఎదుర్కొంది. సినిమా పూర్తయిన దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఈ చిత్రం విడుదలవుతోంది.

మరో వైపు ఈ చిత్రం విడుదలపై కేరళ కోర్టు స్టే విధించింది. ఈచిత్రంపై రాజా రవివర్మ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు, రవి వర్మ జీవితానికి సంబంధం లేదని సినిమా ప్రదర్శన ముందు ప్రకటించాలని, లేకుంటే ప్రదర్శన నిలిపి వేయాలని కోర్టు కెక్కారు.


Click it and Unblock the Notifications











