'బెజవాడ'చూసిన రంగా వర్గీయల స్పందన
బెజవాడ చిత్రం ఈ రోజు మార్నింగ్ షో తో విడుదల అయింది. అయితే మిగతా చోట్ల రెస్పాన్స్ ఎలా ఉన్నా విజయవాడ ప్రజలు,అక్కడ ప్రేక్షకులు,ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగా మిత్ర మండలి సభ్యులు ఎలా స్పందిస్తున్నారనేదే ఇప్పుడు హాట్ టాపిక్. మార్నింగ్ షో చూసి వచ్చిన రాధా మిత్ర మండలి వారిని మీడియా వారు కలవగా వారు మాట్లాడుతూ..ఇది పిచ్చోడు..పిచ్చి సినిమా చూసినట్లుంది అన్నారు. అయితే విజయవాడ ప్రజలను మాత్రం కించపరిచారు. మాట మాటకీ రౌడీయిజం ..రౌడీయిజం అన్నారు అది వాస్తవం. అయినా బెజవాడని పబ్లిసిటిగా వాడుకున్నారు అన్నారు.అలాగే ఈ సినిమా మాట్ని నుంచి ఖాళీ అవుతుందని అనుకుంటున్నాను అన్నారు. పోనీ బెజవాడ ఇష్యూని ప్రక్కన పెట్టి సినిమాని సినిమాలా చూస్తే ఎలా ఉంటుంది అంటే...
ఈ సినిమా పెద్ద బోర్ అన్నారు. ఎందుకంటే..ఈ సినిమా చాలా సీరియస్ నెస్ వెళ్లేటప్పుడు సాంగ్ వస్తుంది. ఓ ఫ్యామిలీ సీన్ జరుగుతున్నప్పుడు..ఓ మర్డర్ జరుగుతుంది. అంటే ఆయన సినిమా పరంగా కూడా ఫెయిలయ్యాడు అన్నారు. అలాగే రంగాకి చెందినటు వంటి సీన్స్ కానీ, రంగాని కించపరిచే సీన్స్ కాని లేవని భావిస్తున్నాము అన్నారు. అభ్యంతరమై సీన్స్ ఏమీ లేవు..ఉంటే మేము గ్యారెంటీగా అడ్డుకునేవాళ్లం అన్నారు. ఫైనల్ గా సినిమా చాలా బోర్ గా ఉంది. నాగచైతన్య భవిష్యత్ పాడుచేసుకుంటున్నాడు. వర్మ ముఖ్యంగా నాగచైతన్యకే దెబ్బ కొట్టాడు అని అన్నారు.


Click it and Unblock the Notifications











