రంగ ది దొంగ రిలీజ్ డేట్ ఎప్పుడంటే...?
శ్రీకాంత్, విమల రామన్ జంటగా నటించిన 'రంగ ది దొంగ' విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ చిత్రాన్ని నవంబర్ 5న విడుదల చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు సుధాకర్ నాయుడు (జీవీ) తెలిపారు. గురువారం చిత్ర గురించి చెబుతూ..హీరో ప్రోత్సాహం, నిర్మాత రాజీలేని సహకారంతో సినిమా బాగా వచ్చింది. చక్రి సొంత సినిమాగా భావించి బాణీలు ఇచ్చారు. పాటలకు మంచి స్పందన లభించింది. 25 మంది కొత్త నటీనటులు పరిచయం కావడం విశేషం. రమ్యకృష్ణ పాత్ర చిత్రరణ సినిమాకే హైలైట్' అన్నారు. మా 'రంగ ది దొంగ" అందరిలాంటి దొంగ కాదు. దొంగతనాలని చాలా కొత్తగా చేస్తుంటాడు. తనని పట్టుకోవడానికి వచ్చిన లేడీ పోలీస్ ఆఫీసర్ దగ్గర కూడా చేతి వాటం చూపిస్తుంటాడు.
ఇక చక్రి మాట్లాడుతూ. పాటలకు స్పందన బాగుంది. క్లాసికల్ టచ్ ఉన్న మెలోడీతోపాటు మాస్ ని ఆకర్షించే పాటలు ప్రధాన బలాలు. సరికొత్త శ్రీకాంత్ ను చూస్తారు. ప్రస్తుతం రీరికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేపథ్య సంగీతం బాగుంది అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ, మహాత్మ తర్వాత మనోహర్ తో చేస్తున్న రెండో సినిమా ఇది. నాపై నమ్మకంతో ఈ సినిమాను నిర్మించినందుకు కృతజ్ఞతలు. ఇందులో ద్విపాత్రాభినయం చేశాను. పూర్తిస్థాయి వాణిజ్య విలువలకు వినోదం జోడించి చేస్తున్న చిత్రమిది. జీవీ పట్టుదలగా తెరకెక్కించారు. 'వేటాడే సింహా..' అనే పాట హైలైట్‌గా నిలుస్తుంది. అన్నారు.


Click it and Unblock the Notifications











