రంగస్థలం: ‘రంగమ్మా..మంగమ్మా’ సాంగ్ అదిరిందంతే....
రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రంగస్థలం'. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో లిరికల్ సాంగ్ విడుదల చేశారు. 'రంగమ్మా..మంగమ్మ' పేరుతో సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రంలో రామ్ చరణ్ చిట్టిబాబు పాత్రలో, సమంత రామలక్ష్మి పాత్రలో కనిపించబోతోంది. ఇద్దరి మధ్య జరిగే సరసాల నేపథ్యంలో ఈ పాట సాగుతుందని తెలుస్తోంది. చంద్రబోస్ అందించిన సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ ఆకట్టుకునే ట్యూన్ ఇచ్చాడు. ఎంఎం మానసి తన అద్భుతమైన గాత్రంతో ఈ పాటకు మరింత వన్నెతెచ్చారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'రంగస్థలం' చిత్రం మార్చి 30 విడుదలకు సిద్ధమవుతోంది. పల్లెటూరి నేపథ్యంలో రోటీన్ సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం ఉండబోతోంది. ఆది పినిశెట్టి, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, అనసూయ భరద్వాజ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











