రాంచరణ్, సమంతకు 10 కోట్ల మంది ఫిదా.. రికార్డుల వేట ఆగడం లేదుగా!

Recommended Video

Rangamma Mangamma Song Creates Record With 100 Million Views

మెగా పవర్ స్టార్ రాంచరణ్, అందాల నటి సమంత ఈ ఏడాది వేసవిలో చరిత్ర సృష్టించారు. టాలీవడ్ అతిపెద్ద విజయాలలో రంగస్థలం చిత్రం ఒకటిగా నిలిచింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ 1980 నాటి పరిస్థితుల నేపథ్యంలో రంగస్థలం చిత్రాన్ని అద్భుతమైన దృశ్య కావ్యంగా మలిచారు. ఈ చిత్రంలో నటించిన ప్రతి పాత్రకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఫలితంగా టాలీవుడ్ లో బాహుబలి తరువాత అంతటి ఘనవిజయంగా ఈ చిత్రం నిలిచింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా ఈ చిత్రాన్ని పెద్ద ప్లస్.

రికార్డులు కొనసాగుతున్నాయి

రికార్డులు కొనసాగుతున్నాయి

రంగస్థలం చిత్రం 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. పల్లెటూరి వాతావరంలోని సన్నివేశాలు, అప్పట్లో గ్రామాల్లో ఉండే రాజకీయ పరిస్థితుల గురించి ఈ చిత్రంలో సుకుమార్ తన ప్రతిభని మొత్తం జోడించి చూపించారు.

ప్రతి పాత్రకి

ప్రతి పాత్రకి

ఈ చిత్రంలో రాంచరణ్ వినికిడి లోపం ఉన్న యువకుడిగా అదరగొట్టాడు. రాంచరణ్ నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. ఇక సమంత పల్లెటూరి కొంటెతనం ఉన్న యువతగా అద్భుత నటన కనబరిచింది. కుమార్ బాబుగా ఆది పినిశెట్టి, రంగమ్మ అత్తగా అనసూయ, ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబులని మరిచిపోలేం.

ప్రతి పాట అద్భుతంగా

ప్రతి పాట అద్భుతంగా

రంగస్థలం చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ప్రతి పాటకు వైవిధ్యం కలిగిన ఆల్బమ్ అందించారు. బ్యాగ్ గ్రౌండ్ సంగీతం అదరగొట్టాడు. ఇక రంగమ్మ మంగమ్మ సాంగ్ ఆడియన్స్ చేత కేకలు పట్టించింది.

100 మిలియనన్లు

100 మిలియనన్లు


రంగమ్మ మంగమ్మ సాంగ్ యూట్యూబ్ లో దూసుకు పోతోంది. తాజగా ఈ వీడియో సాంగ్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. రంగమ్మ మంగమ్మ సాంగ్ కు యూట్యూబ్ లో 100 మిలియన్ల(10 కోట్లు) వ్యూస్ దక్కాయి. ఇప్పటికి ఈ సాంగ్ హవా కొనసాగుతూనే ఉంది. ఈ పాటని ప్రముఖ సింగర్ ఎంఎం మానసి పాడింది.

మరో రికార్డుకి చేరువలో

మరో రికార్డుకి చేరువలో

ఈ చిత్రంలో ఆడియన్స్ హుషారెత్తించిన మరో పాత ఐటమ్ సాంగ్. ఊరమాస్ బీట్ తో సాగే ఈ పాట కూడా ఓ రికార్డుకు చేరువగా ఉంది. త్వరలోనే ఈ సాంగ్ 50 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోబోతోంది. ప్రస్తుతం ఈ సాంగ్ ని 48 మిలియన్ల మంది చూసారు. ఈ చిత్రాల్లో అన్ని పాటలకు ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X