సమంతను మరిపించింది: చిట్టి రామలక్ష్మి డాన్స్ పెర్ఫార్మెన్స్ వైరల్
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలో చిట్టిబాబుగా రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రామ లక్ష్మి పాత్రలో సమంత చేసే అల్లరి చేష్టలు, ముఖ్యంగా 'రంగమ్మా రంగమ్మా' పాటలో సమంత ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ప్రేక్షకులను సైతం గిలిగింతలు పెట్టాయి.
తాజాగా 'రంగమ్మా రంగమ్మా' పాటలకు ఓ చిన్నారి డాన్స్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఈ చిన్నారి వీడియో సమంతను దృష్టిని సైతం ఆకర్షించింది. దీంతో ఆ వీడియోను ఆమె తన అఫీషియల్ ట్విట్టర్ పేజీ ద్వారా షేర్ చేశారు. ఈ వీడియో సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
'రంగస్థలం' సినిమా విషయానికొస్తే ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 180 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి..... తెలుగు సినిమా చరిత్రలో నాన్ బాహుబలి కేటగిరీలో టాప్ పొజిషన్ సొంతం చేసుకుంది. త్వరలోనే ఈ చిత్రం రూ. 200 కోట్ల మార్కును అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. మన తెలుగు నేలకథ, మన తెలుగు పల్లెటూరి కాన్సెప్టు కావడంతో ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ తమ మూలాలు గుర్తు చేసుకునేలా చేసింది. సుకుమార్ దర్శకత్వంతో పాటు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ తదితర అంశాలు ఈ చిత్రాన్ని మరో లెవల్‌కి తీసుకెళ్లాయి.


Click it and Unblock the Notifications











