‘రంగస్థలం’ 100 డేస్... హైదరాబాద్‌లో భారీగా వేడుక

By Bojja Kumar

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రం జులై 8తో 100 రోజులు పూర్తి చేసుకోబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో 15 సెంటర్లలో ఈ చిత్రం విజయవంతంగా శతదినోత్సవం జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో జులై 9న హైదరాబాద్‌లో భారీ వేడుక నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ వేడుకకు సినిమా యూనిట్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లును ఆహ్వానించి భారీ వేడుకగా నిర్వహించాలని, ఈ సందర్భంగా బయ్యర్లకు షీల్డులు ప్రదానం చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యే అవకాశం ఉందనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి.

Rangasthalam 100 days

తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పుడు వంద రోజులు అటే ఎంతో గొప్పగా చెప్పుకునే వారు. అయితే ఇపుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇపుడంతా ఒక వారం, రెండు వారాల ప్రదర్శనలే. ఇలాంటి పరిస్థితుల నడుమ ఈ సినిమా 15 సెంటర్లలో వంద రోజులు పూర్తి చేసుకోవడం విశేషమేమరి.

రామ్ చరణ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రంగస్థలం సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. బాహుబలి తర్వాత 200 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్న తొలి చిత్రంగా ఈ చిత్రం రికార్డుల కెక్కిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X