పవన్ వల్లనే వెనక్కి తగ్గిన రామ్ చరణ్ ? : "రంగస్థలం" కొత్త రిలీజ్ డేట్ ఇదే

రంగస్థలం 1985 సినిమాను ముందుగా అనుకున్న లెక్కల ప్రకారం వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి థియేటర్లకు తీసుకురావాలని భావించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా విడుదల ఇంకాస్త జాప్యం కానుందనే మాట వినిపిస్తోంది.

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ పీరియాడిక్‌ లవ్‌స్టోరీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ టైటిల్ ప్రకటించిన తర్వాత చాలా మందికి ఈ సినిమా నేపథ్యం ఏమిటో అర్థం కాలేదు. ఇదేమైనా రంగస్థల నాటకాల గురించి ఉంటుందా? టైటిల్‌లో 1985 అని ప్రేత్యేకంగా మెన్షన్ చేయడం వెనక కారణం ఏమిటి? ఇలా రకరకాలు సందేహాలు. అయితే రంగస్థల నాటకాలకు, మా సినిమాకి ఎలాంటి సంబంధం లేదు. పల్లెటూళ్లలో ఎవరిగోల వాళ్లదే అన్నట్టుగా ఉండరు. ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అంతా ఒక చోట గుమిగూడి ఏం జరిగిందంటూ తెలుసుకుని తమవంతు సహాయ సహకారాలను అందిస్తారు. అలా వాళ్లందరినీ ఒకేచోట చూసినప్పుడు ఆ ఊరు ఒక వేదికలా కనిపిస్తుంది. ప్రతి పల్లెటూరు ఒక రంగస్థలమే కదా అనిపిస్తుంది. అందుకే ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టామని సుకుమార్ చెప్పాడి. అయినా సరే సినిమా మీద ఉన్న హైప్ ఏమాత్రం తగ్గలేదు.

విడుదల ఇంకాస్త జాప్యం

విడుదల ఇంకాస్త జాప్యం

రంగస్థలం 1985 సినిమాను ముందుగా అనుకున్న లెక్కల ప్రకారం వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి థియేటర్లకు తీసుకురావాలని భావించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా విడుదల ఇంకాస్త జాప్యం కానుందనే మాట వినిపిస్తోంది. పీరియాడికల్ మూవీగా రంగస్థలం తెరకెక్కుతోంది.

 టాలీవుడ్ లేటెస్ట్ టాక్

టాలీవుడ్ లేటెస్ట్ టాక్

ఇందులో అక్కినేని వారింటి కొత్తకోడలు సమంత అచ్చమైన పల్లెపడుచుగా కనిపించబోతోంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ గెడ్డం పెంచి కొత్తలుక్ లో కనిపిస్తున్నాడు. జనవరికి ఈ సినిమా థియేటర్లకు తెద్దామని చిత్ర యూనిట్ అనుకున్నా షూటింగ్ ఇంకా కొలిక్కి రాకపోవడంతో సమ్మర్ కు ముందుగా మార్చి 30 నాటికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారనేది టాలీవుడ్ లో లేటెస్ట్ టాక్.

Recommended Video

Ram Charan Again Released One Of Rangasthalam Look
సంక్రాంతి బరిలో నిలపాలని

సంక్రాంతి బరిలో నిలపాలని

అసలైతే 'రంగస్థలం 1985' మూవీని సంక్రాంతి బరిలో నిలపాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో పవర్ స్టార్ మూవీ రిలీజ్ అని తెలియడంతో వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో రంగస్థలం నిర్మాతలు పునరాలోచనలో పడ్డారట. అందుకే కొన్నాళ్ళు ఆగి రిలీజ్ చేద్దామనే నిర్ణయించుకున్నారట

షూటింగ్ కంప్లీట్ అయిపోవాలి

షూటింగ్ కంప్లీట్ అయిపోవాలి

రిలీజ్ ఎప్పుడంటే అప్పుడు చేసుకోవాలంటే ముందు షూటింగ్ కంప్లీట్ అయిపోవాలి కదా. అందుకే స్పీడ్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నారని సమాచారం. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మూవీ కాబట్టి గోదావరి జిల్లాల్లో షూటింగ్ పెట్టారు. అయితే అక్కడి జనం అడుగడుగునా అడ్డుతగులుతున్నారు.

అసలు రిలీజ్ డేట్ ఎప్పుడు

అసలు రిలీజ్ డేట్ ఎప్పుడు

ఇక లాభం లేదనుకున్నారో ఏమో గాని హైదరాబాద్‌లోనే గోదావరి తీర ప్రాంత సెట్‌ వేశారట. అక్కడే షూటింగ్‌ వేగంగా పూర్తి చేస్తున్నారని తెలుస్తుంది. మరి చరణ్ రంగస్థలం అసలు రిలీజ్ డేట్ ఎప్పుడు అన్నది అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తేనే కాని తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X