For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    4వ స్థానంలో రామ్ చరణ్, అంతకంటే ముందు ఎవరంటే...

    By Bojja Kumar
    |
    భారీ రేటుకు 'రంగస్థలం' ఆడియో రైట్స్ !

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రంగస్థలం' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. 1985 నాటి పరిస్థితులతో పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రామ్ చరణ్ కోరీర్లోనే ఒక డిఫరెంట్ చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. మార్చి చివరి వారంలో ఈ సినిమా విడుదల కానుంది.

    ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం లహరి మ్యూజిక్ వారు ఆడియో రైట్స్ భారీ రేటుకు దక్కించుకున్నారు. ఇది టాలీవుడ్లో 4వ బిగ్గెస్ట్ ఆడియో డీల్‌ అని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.

    రూ. 1.60 కోట్లు పలికిన రంగస్థలం

    రూ. 1.60 కోట్లు పలికిన రంగస్థలం

    డీఎస్పీ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో రైట్స్ లహరి మ్యూజిక్ వారు రూ. 1.60 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా కంటే ముందు మరో మూడు సినిమాలు ముందున్నాయి.

     ‘భరత్ అను నేను'

    ‘భరత్ అను నేను'

    మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరెక్కుతున్న ‘భరత్ అను నేను' సినిమా ఆడియో రైట్స్ రూ. 2 కోట్ల పైచిలుకు మొత్తానికి అమ్ముడుపోయింది. ఈ చిత్రానికి కూడా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటం విశేషం.

     అజ్ఞాతవాసి మూవీ

    అజ్ఞాతవాసి మూవీ

    పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అజ్ఞాతవాసి'. ఈ చిత్రానిక అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో రైట్స్ రూ. 2 కోట్లకు అమ్ముడు పోయాయి.

    స్పైడర్

    స్పైడర్

    మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్పైడర్' చిత్రం ఆడియో రైట్స్ అప్పట్లో తెలుగు, తమిళంలో కలిపి రూ. 2 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందించారు.

    English summary
    Audio rights of Rangasthalam 1985 have been sold for a whopping price to Lahari Music. The leading music distributor bagged the DSP’s output for a massive 1.60 cr deal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X