‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్.... సెలబ్రేషన్స్ మొదలయ్యాయి!

By Bojja Kumar

Recommended Video

Rangasthalam Movie Block Buster Hit..Fans Celebrates

రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అని తేలిపోయింది. తెలుగు రాష్ట్రాల కంటే ముందుగా 'రంగస్థలం' చిత్రం యూఎస్ఏలో విడుదలైంది. సినిమా విడుదల ముందు నుండే భారీ క్రేజ్ ఏర్పడటంతో ప్రీమియర్ షో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇక్కడ తొలి ఆట పూర్తయిన తర్వాత ప్రతి ప్రేక్షకుడి నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో యూఎస్ఏలో ఈ చిత్రాన్ని విడుదల చేసిన క్రియేటివ్ సినిమాస్ వారు సంబరాలు చేసుకున్నారు.

సెలబ్రేషన్స్ మొదలు

చాలా రోజుల తర్వాత పల్లెటూరి నేపథ్యంలో అద్భుతమైన కంటెంటు, విజువల్స్, మ్యూజిక్ జోడిస్తూ వచ్చిన ‘రంగస్థలం' చిత్రానికి ప్రేక్షకుల నుండి ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది.

ప్రీమియర్ షో వసూళ్లు అదుర్స్

ప్రీమియర్ షో వసూళ్లు అదుర్స్

‘రంగస్థలం' సినిమా నార్త్ అమెరికా వ్యాప్తంగా దాదాపు 190 లొకేషన్లలో విడుదలైంది. అమెరికా కాలమానం ప్రకారం మార్చి 29న సాయంత్రం ప్రీమియర్ షోలు వేశారు. మధ్యాహ్నం 1.15 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 143 లొకేషన్ల నుండి $449,920 వసూలైంది. ఒక్కో లొకేషన్ నుండి యావరేజ్‌గా $3,083 వసూలైంది. అన్ని ప్రాంతాల నుండి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

ప్రీమియర్ షోల ద్వారా 1 మిలియన్ ఛాన్స్

ప్రీమియర్ షోల ద్వారా 1 మిలియన్ ఛాన్స్

నార్త్ అమెరికాతో పాటు ఇతర ఓవర్సీస్ లొకేషన్లలో వేసిన ప్రీమియర్ షో కలెక్షన్లు కలిపితే 1 మిలియన్ డాలర్ మార్క్ రీచ్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

అందుకే అంత నచ్చింది

అందుకే అంత నచ్చింది

‘రంగస్థలం' చిత్రానికి ఇంత మంచి రెస్పాన్స్ రావడానికి కారణం..... సుకుమార్ స్టోరీ టెల్లింగ్ అద్భుతంగా ఉండటంతో పాటు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, పాపికొండలు అందాలను రత్నవేలు చూపించిన తీరు సినిమాకు బాగా ప్లస్సయింది. అందుకే ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X