తిరుగులేని 50 రోజులు.. బాక్స్ ఆఫీస్‌ని దున్నేసిన మెగా పవర్ స్టార్, గర్వపడే రోజు!

Recommended Video

Rangasthalam Completes Its 50 Days Of Journey

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్ర ఘనవిజయంలో మరో మైలురాయి అధికమించింది. నేటితో రంగస్థలం చిత్రం 50 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఒకప్పుడు అయితే సినిమా ఎన్ని రోజులు ఆడింది అని మాట్లాడుకునే వారు. కానీ ఇప్పుడు చిత్రాల విడుదల శైలిలో చాలా మార్పులు వచ్చాయి. అత్యధిక థియేటర్ లలో విడుదలవుతుండడం వలన ఓ చిత్రం రెండు వారాలు ఆడితే గొప్పగా చెప్పుకుంటున్నారు. తొలి వారంలోనే 80 శాతం వసూళ్లు రాబడుతున్నాయి. దీనితో ఎంత వసూలు చేసింది అని మాత్రమే మాట్లాడుకుంటున్నారు. రంగస్థలం చిత్రం ఆ రెండు ఘనతలని దక్కించుకుంది.

 దిగ్విజయంగా 50 రోజులు

దిగ్విజయంగా 50 రోజులు

మార్చి 30 న వేసవి కానుకగా ప్రేక్షుకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలని అందుకుని ప్రభంజనం సృష్టించింది. పల్లెటూరు కథ, స్థానికంగా జరిగే రాజకీయ అంశాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కి ఇప్పటికి ప్రేక్షకులని అలరిస్తూనే ఉంది.

 రాంచరణ్ అద్భుత నటన

రాంచరణ్ అద్భుత నటన

రాంచరణ్ ఈ చిత్రంలో తన ఆహార్యం, నటనతో అబ్బురపరిచారు. ఎటువంటి వంకరలు పెట్టలేని విధంగా రాంచరణ్ పెర్ఫామెన్స్ ఈ చిత్రంలో సాగింది. వినికిడి లోపం ఉన్న యువకుడిగా చరణ్ హాస్య భరితమైన సన్నివేశాలతో అలరిస్తూనే, ఎమోషనల్ సీన్స్ లో గుండెలు పిండేశాడు. సమంత రామలక్ష్మిగా అదరగొట్టేసింది.

 సుకుమార్ మ్యాజిక్

సుకుమార్ మ్యాజిక్

దర్శకుడు సుకుమార్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన శైలిలో రాసుకున్న కథ, తనకు మాత్రమే సాధ్యమైన స్క్రీన్ ప్లే తో సుక్కు అద్భుతమైన మ్యాజిక్ చేసాడు. రాంచరణ్ ని అలాంటి పాత్రలో చూపించడం పెద్ద సాహసమే. రంగమ్మత్తగా అనసూయ పాత్రని, కుమార్ బాబుగా ఆది పినిశెట్టి పాత్రని సుక్కు అద్భుతంగా మలిచారు.

బాక్స్ ఆఫీస్ దుమ్ముదులిపారు

బాక్స్ ఆఫీస్ దుమ్ముదులిపారు

రాంచరణ్ కెరీర్ లో రంగస్థలం చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ మాటకు వస్తే వసూళ్ల పరంగా బాహుబలి తరువాత స్థానంలో నిలిచింది. దాదాపు 200 కోట్లకు పైగా గ్రాస్ (షేర్ 120 కోట్లకు పైనే) తో బాక్స్ ఆఫీస్ యుద్ధమే చేసింది.

 మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఖర్చుకు వెనకాడకుండా కోట్లాది రూపాయల ఖర్చుతో రంగస్థలం అనే గ్రామాన్నే సృష్టించారు. రంగస్థలం చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సంతోషం వ్యక్తం చేసింది. రంగస్థలం చిత్ర యూనిట్ కు ఇది గర్వపడే రోజు అని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X