»   » ‘రంగస్థలం’.... ఈ మెగా ఫ్యామిలీ రికార్డులను బద్దలు కొడుతుందా?

‘రంగస్థలం’.... ఈ మెగా ఫ్యామిలీ రికార్డులను బద్దలు కొడుతుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'రంగస్థలం' నార్త్ అమెరికాలో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. భారీ హైప్ రావడంతో ఈ చిత్రం ఇప్పటి వరకు యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద ఉన్న మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలైన డిజె, ఫిదా, ఖైదీ నెం.150, అజ్ఞాతవాసి రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అనే అభిప్రాయాలు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

మెగా ఫ్యామిలీ హీరోలకు యూఎస్ఏలో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటి వరకు అక్కడ విడుదలైన మెగా మూవీస్ అన్నీ భారీ ఓపెనింగ్స్ సాధించాయి. పవన్ కళ్యాణ్ నటించిన ఐదు సినిమాలు అజ్ఞాతవాసి, కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ అక్కడ 1 మిలియన్ గ్రాస్ సాధించాయి. అదే విధంగా బన్నీ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు, దువ్వాడ జగన్నాధమ్, వరుణ్ తేజ్ నటించిన ఫిదా, తొలి ప్రేమ, మెగా స్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ 'ఖైదీ నెం 150' చిత్రాలు 1 మిలియన్ మిలియన్ పైగా వసూలు చేసి తమ సత్తా చాటాయి.


Rangasthalam Satellite Rights Are Marvelous
రామ్ చరణ్ కాస్త వెనకే...

రామ్ చరణ్ కాస్త వెనకే...

అయితే ఇతర మెగా హీరోలతో పోలిస్తే రామ్ చరణ చిత్రాలు యూఎస్ బాక్సాఫీసు వద్ద కాస్త వెనకబడి ఉంది. ఇప్పటి వరకు చరణ్ నటించిన ‘ధృవ' చిత్రం మాత్రమే అక్కడ 1 మిలియన్ మార్కును అందుకుంది. అయితే ఇపుడు అందరి దృష్టి మార్చి 29న యూఎస్ఏలో విడులవుతున్న ‘రంగస్థలం' సినిమాపై ఉంది. ఈ సినిమా ఇక్కడ ఎంత వసూలు చేసింది, ఇప్పటి వరకు ఉన్న ఇతర మెగా హీరోల రికార్డులను ఇది బద్దలు కొడుతుందా? అనే విషయమై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బిగ్గెస్ట్ రిలీజ్

బిగ్గెస్ట్ రిలీజ్

నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటర్లు రంగస్థలం కోసం ఇప్పటికే 194 స్క్రీన్లు బుక్ చేశారు. రామ్ చరణ్ కెరీర్లో ఇదే ఇక్కడ హయ్యెస్ట్ రిలీజ్. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ భారీ ఎత్తున జరుగడంతో రామ్ చరణ్ కెరీర్లో ఈ చిత్రం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.


ఇతర మెగా మూవీస్ ప్రిమియర్ షోల వసూళ్లు

ఇతర మెగా మూవీస్ ప్రిమియర్ షోల వసూళ్లు

ఇప్పటి వరకు వచ్చిన మెగా ఫ్యామిలీ సనిమాలు సినిమాలు అజ్ఞాతవాసి($1.51 మిలియన్), ఖైదీ నెం.150 ($1.29 మిలియన్), డిజె ($400,000) ప్రీమియర్ షోల ద్వారా మంచి వసూళ్లు సాధించాయి. అయితే రంగస్థలం ప్రీమియర్ షోల ద్వారా ఎంత వసూలు చేస్తుందో చూడాలి.


రామ్ చరణ్ వీటిని అధిగమించాల్సి ఉంది

రామ్ చరణ్ వీటిని అధిగమించాల్సి ఉంది

యూఎస్ఏలో మెగా ఫ్యామిలీ హీరోల లైఫ్ టైమ్ హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన సినిమాలు ఖైదీ నెం.150 ( $2.447 మిలియన్), ఫిదా ($2.067 మిలియన్), అజ్ఞాతవాసి ($2.065 మిలియన్). మరి ‘రంగస్థలం' ఈ చిత్రాలను అధిగమిస్తుందా? లేదా? అనే హాట్ టాపిక్ నడుస్తోంది.
English summary
Ram Charan's Rangasthalam is expected to beat the box office collection records of DJ aka Duvvada Jagannadh, Fidaa, Khaidi No 150 and Agnyathavasi in the US market.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X